తెలంగాణ

telangana

ETV Bharat / state

సహాయం చేయాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి: సజ్జనార్​ - సైబారాబాద్​ సీపీ సజ్జనార్​ వార్తలు

హైదరాబాద్​లో పలు స్వచ్ఛంద సంస్థలు, పలువురు అన్నదానం, నిత్యావసర సరుకుల పంపిణీ వల్ల గుంపులుగా గుమిగూడాల్సి వస్తోందని సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ తెలిపారు. ఇది లాక్‌ డౌన్​ నిబంధనలను ఉల్లంఘించడమేనని వివరించారు. సహాయం చేయాలనుకునేవారు పోలీసులు, జీహెచ్​ఎంసీ అధికారులను సంప్రందిచాలని కోరారు.

సహాయం చేయాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి: సజ్జనార్​
సహాయం చేయాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి: సజ్జనార్​

By

Published : Apr 5, 2020, 10:52 AM IST

లాక్ డౌన్ కారణంగా స్వచ్ఛంద సంస్థలు, పలువురు హైదరాబాద్​లో అన్నదానం, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాల వల్ల అందరూ గుంపులుగా వస్తున్నారు. ఇది లాక్​ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిడమేనని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు.. జీహెచ్ఎంసీ వలస కూలీలకు, నిరాశ్రయులకు చేయతనిస్తున్నారని పేర్కొన్నారు.

ఎవరైనా దాతృత్వంతో ముందుకు వచ్చే వాళ్ళు.. సైబరాబద్ పోలీసులను, జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించాలని సజ్జనార్​ కోరారు. సహాయం చేయాలనుకునే వారు 9490617440, 9490617431, 9493120244 ఫోన్​ నంబర్లను సంప్రదించాలని ఆయన వివరించారు. సామాజిక దూరం పాటించకుండా సహాయ కార్యక్రమాలు చేసే వాళ్లపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని సజ్జనార్​ హెచ్చరించారు.

ఇదీ చూడండి:మాస్కు​ ఎవరు వాడాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

ABOUT THE AUTHOR

...view details