కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్డౌన్ అమలుకు ప్రజలు సహకరించాలని... సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. ఎర్రగడ్డ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్ట్‌ను ఆయన తనిఖీ చేశారు. ఉదయం 10 గంటల తరువాత... అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు: సీపీ సజ్జనార్ - hyderabad latest news
లాక్డౌన్ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలు సీజ్ చేస్తామని... సైబరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. నగరంలో మూడోరోజు లాక్డౌన్ అమలులో భాగంగా ఎర్రగడ్డ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
లాక్డౌన్ అమలును పరిశీలించిన సీపీ సజ్జనార్
కొందరు వాహనదారులు అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారని సీపీ అన్నారు. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. అనవసరంగా వచ్చే వారిపై చట్టరిత్యా కేసులు నమోదు చేసి వారి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: రాష్ట్ర సరిహద్దులో ఏపీ అంబులెన్స్‌ల నిలిపివేత