సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో 9 ఏసీపీ డివిజన్లకు సంబంధించి ప్రత్యేక వాహనాలు, పరికరాలు, బృందాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వాహనాలను సీపీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. క్లిష్టమైన కేసుల దర్యాప్తులో క్లూస్ బృందాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. శాస్త్రీయంగా స్పష్టమైన ఆధారాలు సేకరించడంలో ఈ బృందాలు చాలా ముందుంటాయని... తద్వారా కేసుల పరిష్కారం సులభతరమవుతుందని ఆయన తెలిపారు.
దర్యాప్తులో క్లూస్ టీమ్‌లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్ - క్లూస్ టీమ్ తాజా వార్తలు
క్లిష్టమైన కేసుల దర్యాప్తులో క్లూస్ టీమ్‌లు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ అన్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో 9 ఏసీపీ డివిజన్లకు సంబంధించి ప్రత్యేక వాహనాలు, పరికరాలు, బృందాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వాహనాలను సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు.
దర్యాప్తులో క్లూస్ టీమ్‌లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
గతంలో కమిషనరేట్ పరిధిలోని ఒక డీసీపీ పరిధిలో ఒక క్లూస్ టీం ఒక్కటి మాత్రమే అందుబాటులో ఉండేది... ప్రస్తుతం ఒక్కో డివిజన్‌కు ఒకటి చొప్పున క్లూస్ బృందం అందుబాటులోకి రావటంతో ఈ వ్యవస్థ మరింత బలోపేతమైందని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు ప్రకాశ్ రెడ్డి, పద్మజ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు