ట్రాన్స్జెండర్లకు సమాజంలో సరైన గుర్తింపు లేదని.. సమాజంలో వారికి సుముఖత స్థానం కోసం సైబరాబాద్ పోలీసులు కృషి చేస్తున్నారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ డెస్క్‌ను సజ్జనార్ ప్రారంభించారు. ఈ డెస్క్ ద్వారా ట్రాన్స్జెండర్లకు ఉపాధి అవకాశాలు, ప్రభుత్వం నుంచి లభించే సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తారని చెప్పారు.
ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ డెస్క్‌ను ప్రారంభించిన సీపీ సజ్జనార్ - ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ డెస్క్
హైదరాబాద్ గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ డెస్క్‌ను సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రారంభించారు. ట్రాన్స్జెండర్లకు ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఈ డెస్క్ దోహదపడుతుందని తెలిపారు.
ట్రాన్స్జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎస్సీఎస్సీ ముందుకు రావడం అభినందనీయమని సజ్జనార్ పేర్కొన్నారు. కాగ్నిజెంట్‌తో పాటు పలు సాఫ్ట్వేర్ కంపెనీల్లో 18 మంది ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు లభించాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాసాగర్ రావు, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ సాకేత్, ఎస్సీఎస్సీ అధ్యక్షుడు వేదుల కృష్ణ, సైబరాబాద్ షీ టీమ్స్ ఇన్ఛార్జ్ డీసీపీ అనసూయ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది: మంత్రి ఎర్రబెల్లి