తెలంగాణ

telangana

ETV Bharat / state

మెరుగైన సమాజ నిర్మాణం కోసం యువత కృషి చేయాలి: సజ్జనార్​

మెరుగైన సమాజ నిర్మాణం కోసం యువత కృషి చేయాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. సైబరాబాద్ పోలీసుల సహకారంతో డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న రెండో మెగా వార్షిక ఆహర పంపిణీ కార్యక్రమాన్ని దృశ్యమాధ్యమ సమావేశం ద్వారా ఆయన ప్రారంభించారు.

మెరుగైన సమాజ నిర్మాణం కోసం యువత కృషి చేయాలి: సజ్జనార్​
మెరుగైన సమాజ నిర్మాణం కోసం యువత కృషి చేయాలి: సజ్జనార్​

By

Published : Sep 27, 2020, 11:03 PM IST

ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సహయపడే స్వభావాన్ని అలవాటు చేసుకోవాలని సీపీ సజ్జనార్​ సూచించారు. సైబరాబాద్ పోలీసుల సహకారంతో డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న రెండో మెగా వార్షిక ఆహర పంపిణీ కార్యక్రమాన్ని దృశ్యమాధ్యమ సమావేశం ద్వారా ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అవసరం ఉన్న వారికి ఆహారం అందిచటం చాలా గొప్ప విషయమని.. ఇప్పటి వరకూ 5వేల మందికి ఈ ఫౌండేషన్ ద్వారా లాక్​డౌన్ సమయంలో కడుపు నిండా భోజనం దొరికిందని సీపీ పేర్కొన్నారు.

డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్ లాక్​డౌన్ సమయంలో హైదరాబాద్​తో పాటు విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో వేల మందికి ఆహారాన్ని అందించారని కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ కొనియాడారు. మరింత మందికి ఈ సంస్థ ఆహారాన్ని అందించేందుకు పలు ఎన్జీవోలు ముందుకు రావాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి:నగరాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతాం’

ABOUT THE AUTHOR

...view details