నకిలీ వీసాల కేసులో రెండు ముఠాలకు చెందిన సభ్యులను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. కడప, నెల్లూరుకు చెందిన మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి చరవాణులు, రూ.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. విదేశాలకు వెళ్తే ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చని ఆశ చూపి చాలా మందిని నకిలీ వీసాలతో శ్రీలంక, కువైట్కు పంపిస్తున్నారని వివరించారు. చేవెళ్లలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్న కానిస్టేబుల్ను కూడా అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నకిలీ వీసా గుట్టురట్టు... నిందితుల్లో కానిస్టేబుల్ - నకిలీ వీసాలు
విదేశాల్లో ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చని ఆశ చూపి నకిలీ వీసాలతో అక్రమంగా మనుషులను తరలిస్తున్న ముఠాల ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు. నిందితుల్లో ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉండడం గమనార్హం.
![నకిలీ వీసా గుట్టురట్టు... నిందితుల్లో కానిస్టేబుల్](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2745046-381-cedbbdeb-2125-4e10-8746-1f9b51f2fa25.jpg)
సీపీ సజ్జనార్
Last Updated : Mar 20, 2019, 6:05 PM IST