తెలంగాణ

telangana

ETV Bharat / state

హైటెక్​ సిటీలో సజ్జనార్​ తనిఖీలు.. వాహనాలు సీజ్​​ - government lock down news

ప్రభుత్వం లాక్​డౌన్ ప్రకటించినా ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారని పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ స్వయంగా హైటెక్​ సిటీ చౌరస్తా వద్ద తనిఖీలు నిర్వహించారు. అనవసరంగా బయటకు వచ్చిన వాహనదారుల వాహనాలను సీజ్​ చేశారు. అలాగే హిమాయత్​ నగర్​ కూడలి వద్ద నారాయణ గూడ ట్రాఫిక్​ పోలీసులు కరోనా వైరస్​పై అవగాహన కల్పించారు.

హైటెక్​ సిటీలో సజ్జనార్​ తనిఖీలు.. వాహనాలు సీజ్​​
హైటెక్​ సిటీలో సజ్జనార్​ తనిఖీలు.. వాహనాలు సీజ్​​

By

Published : Mar 23, 2020, 6:10 PM IST

హైటెక్​ సిటీలో సజ్జనార్​ తనిఖీలు.. వాహనాలు సీజ్​​

ప్రభుత్వం లాక్ డౌన్​ ప్రకటించిన ప్రజలు బేఖాతరు చేస్తున్నారని పోలీసులు చర్యలు చేపట్టారు. సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ స్వయంగా హైటెక్ సిటీ చౌరస్తా వద్ద తనిఖీలు నిర్వహించారు. అనవసరంగా బయటకు వచ్చిన వాహనదారుల వాహనాలు సిజ్ చేశారు. ప్రజలు నిత్యావసర సరుకులు, మేడికల్ పరమైన సమస్యలు ఉంటే తప్ప బయటకు రాకూడదని సజ్జనార్​ హెచ్చరించారు.

అలాగే హైదరాబాద్ హిమాయత్ నగర కూడలి వద్ద వాహనదారులకు కరోన వైరస్​పై నారాయణ గూడ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. కొవిడ్​-19 వ్యాప్తి చెందకుండా ఉండాలంటే బయట తిరగొద్దంటూ విజ్ఞప్తి చేశారు. దేశాన్ని.. మన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే... ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని కోరారు.

ఇదీ చూడండి:తెలంగాణలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details