రాష్ట్రంలో నకిలీ విత్తనాలపై పోలీసుల ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ ఏడాది వానాకాలం ఆరంభమైన నేపథ్యంలో.. అక్రమార్కులు నకిలీ విత్తనాలు విక్రయాలకు తెరలేపారు. అప్రమత్తమైన పోలీసు శాఖ విస్తృత దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 8 కేసులు నమోదు చేసి 10 మందిని అరెస్ట్ చేశారు.
4,500 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, 4 వేల కిలోల నకిలీ మొక్కజొన్న విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత బీజీ-2 రకం పత్తి విత్తనాలు 4,290 కిలోలు, 115 కిలోల బీజీ-3 విత్తనాలు, 10 లీటర్ల గ్లైఫోసేట్ కలుపు మందు, మరో 100 లీటర్ల క్రిమిసంహారక పురుగు మందులు స్వాధీనం చేసుకున్నారు.