తెలంగాణ

telangana

ETV Bharat / state

Cyber ​​Security Course : ఇకపై డిగ్రీలో సైబర్‌ సెక్యూరిటీ కోర్సు.. ప్రతి విద్యార్థి చదవాల్సిందే - సైబర్ సెక్యూరిటీ కోర్సు

Cyber ​​Security Course in Degree : సైబర్‌ సెక్యూరిటీ.. ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ విభాగాల్లో ఇది కూడా ఒకటి. ఈ రంగంలో ఉన్నతమైన కెరియర్‌ను నిర్మించుకోవాలనుకునే విద్యార్థులను పూర్తి స్థాయిలో తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే డిగ్రీలో సైబర్ సెక్యూరిటీ కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది.

Cyber ​​Security
Cyber ​​Security

By

Published : Jun 10, 2023, 10:07 AM IST

Cyber ​​Security Course in Telangana Degree Education : సంపద పెరిగే కొద్దీ దానిపై దాడులు పెరుగుతుంటాయి. అందుకే దానికి తగిన రక్షణ ఏర్పాటు చేయాలి. అలాగే టెక్నాలజీ, అడ్వాన్స్‌మెంట్‌ పెరిగే కొద్దీ.. ఆర్థిక నేరాలు, సమాచార చౌర్యం వంటివి పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు బలమైన నైపుణ్య వ్యవస్థ అవసరం. అందులో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వాలు, సంస్థలు, కంపెనీలు సైబర్‌ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. అంతా ఆన్‌లైన్‌లో జరుగుతున్న నేటి కాలంలో.. ఈ నిపుణులకు గిరాకీ చాలా ఉంది అనడంలో ఆశ్చర్యం లేదు.

Cyber ​​Security Course in Telangana : దాంతోసైబర్‌ సెక్యూరిటీలో ఇప్పటికే ఉన్న డిగ్రీలు, సర్టిఫికేషన్లకు అదనంగా కొత్త తరహా కోర్సులు, కాంబినేషన్లు ఏర్పాటు చేసేందుకు విద్యాసంస్థలు ప్రయత్నిస్తున్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌, బిజినెస్‌, ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఈ మార్పులు అధికంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పెరుగుతున్న అవసరాలకు తగినట్టుగా ఈ చదువులు ఉండబోతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టెక్నాలజీకి అనుగుణంగా ఇక నుంచి డిగ్రీ చదివే విద్యార్థులు సాంకేతిక విద్యలో రాణించాలనే ఉద్దేశంతో ఓ కొత్త విధానానికి ఈ విద్యా సంవత్సరం నుంచే శ్రీకారం చుట్టనుంది.

ఆ విధానం ఏమిటంటే : రాష్ట్రంలోప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే డిగ్రీలో నూతన కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇకపై ప్రతి విద్యార్థి సైబర్‌ సెక్యూరిటీ కోర్సు (నాలుగు క్రెడిట్లుగా)ను అదనంగా చదవాల్సి ఉంటుంది. విద్యార్థుల సామర్థ్యాల మదింపునకు పరీక్షల నిర్వహణ విధానాన్ని, ప్రశ్నపత్రాల మూల్యాంకనాన్నీ కొత్త విధానంలో చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలిఅధ్యక్షుడు ఆర్‌.లింబాద్రి అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాలలు, సాంకేతిక విద్యా కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, మండలి ఉపాధ్యక్షుడు వి.వెంకటరమణ, ఓయూ వీసీ డి.రవీందర్‌తో పాటు వివిధ వర్సిటీ వీసీలు పాల్గొన్నారు. ఐఎస్‌బీ నుంచి ఆచార్య చంద్రశేఖర్‌ శ్రీపాద, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆచార్య గరిమ మాలిక్‌ హాజరై ఐఎస్‌బీ అధ్యయనం చేసిన ‘అసెస్‌మెంట్‌, ఎవాల్యుయేషన్‌ సిస్టం’ నివేదికను సమర్పించారు. అదే విధంగా ఈ సమావేశంలో డిగ్రీలో చేపట్టబోయే సంస్కరణలు, నూతన కోర్సులు, ఇతర అకాడమిక్‌ అంశాలపై అధికారులు చర్చించారు.

ప్రధాన కోర్సులతో పాటు అదనంగా ఈ కోర్సు :ఎక్కువ సంఖ్యలో డిగ్రీ కళాశాలల్లో నైపుణ్య ఆధారిత కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. బీఎస్సీ(ఆనర్స్‌) కంప్యూటర్‌ కోర్సునూ ప్రారంభిస్తారు. డిగ్రీ చదివే ప్రతి విద్యార్థీ వాల్యూ అడిషన్‌లో భాగంగాసైబర్‌ సెక్యూరిటీ కోర్సును నాలుగు క్రెడిట్లుగా చదవాల్సి ఉంటుంది. ప్రధాన కోర్సులతో పాటు దీనిని అదనంగా చదవాలి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details