మలక్‌పేటకు చెందిన సయ్యద్ అహ్మద్‌కు ఓ సైబర్ లేడి ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వస్ట్ పెట్టింది. విదేశాల్లో ఉంటానని పరిచయం చేసుకుంది. ప్రేమ పేరుతో చాటింగ్ చేస్తూ... వాట్సాప్ వరకు వచ్చేసింది. త్వరలోనే భారత్‌కు వస్తున్నానని మెసేజ్ చేసింది.
ఫేస్బుక్లో ప్రేమ అంది... కాపాడాలంటూ... - చాటింగ్ చేసి చీటింగ్
ఫేస్బుక్ నుంచి వాట్సాప్ వరకు ప్రేమతో దగ్గరైంది. నీకోసం భారత్‌కు వస్తున్నానని నమ్మబలికింది. 'దిల్లీ ఎయిర్‌పోర్టులో ఉన్నాను... నా బ్యాగ్ కస్టమ్స్ అధికారుల వద్ద ఉంది. వెంటనే విడిపించు' అంటూ మోసం చేసింది.
వారం క్రితం ఇండియాకు వచ్చానని... దిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఉన్నానని... తనతో తెచ్చుకున్న బ్యాగ్‌ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని తెలిపింది. తనను విడిపించాలని ప్రాధేయపడింది. తన దగ్గరున్న కరెన్సీకి కస్టమ్ ఛార్జ్, ఇన్కమ్ టాక్స్ ఛార్జ్ పేరుతో లక్షా 26 వేల నగదు కావాలంటూ నమ్మబలికింది. నమ్మిన సయ్యద్ ఆమెకు డబ్బును ఆన్లైన్ ద్వారా పంపాడు. అనంతరం ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని తెలుసుకుని... సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చూడండి:తెలంగాణపై కరోనా పంజా... పెరుగుతున్న కేసులు