సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన రవిశంకర్ చరవాణికి పది రోజుల క్రితం ఒక సందేశం వచ్చింది. పేటీఎం ఉపయోగించుకోవాలంటే వినియోగదారుడి పూర్తి వివరాలు సమర్పించాలనేది దాని సారాంశం. చరవాణీకి వచ్చిన సందేశాన్ని బట్టి రవిశంకర్ ఫోన్ చేసి తనకున్న సందేహాలను అడిగాడు. అవతలి వ్యక్తి సైబర్ మోసగాడు అని తెలుసుకోలేని రవిశంకర్... అతను చెప్పినట్లు చేశాడు. పేటీఎంను అప్డేట్ చేయడానికి ఎనీ డెస్క్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలు చెప్పాలని సైబర్ నేరగాడు సూచించాడు. రవిశంకర్ తన ఖాతాకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో పొందుపర్చడంతోపాటు.... 100 రూపాయల నగదును బదిలీ చేసే ప్రయత్నం చేశాడు. ఖాతాను అప్పటికే హ్యాక్ చేసిన సైబర్ నేరగాడు.... రవిశంకర్ పేటీఎంకు అనుసంధానమై ఉన్న ఆక్సిస్ బ్యాంకు ఖాతా నుంచి 19 లావాదేవీలు నిర్వహించి రూ.63వేలకు పైగా నగదును ఇతర ఖాతాలకు బదిలీ చేసుకున్నాడు. మోసపోయానని గ్రహించిన రవిశంకర్ సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పేటీఎం అప్డేట్ చేయండి అంటూ ఫోన్..
రాంచంద్రాపురంలోని వినాయక్ నగర్‌కు చెందిన ఫక్రుద్దీన్ మహమ్మద్‌కు వారం క్రితం ఓ వ్యక్తి ఫోన్ చేసి పేటీఎం అప్డేట్ చేయడానికి క్విక్ సపోర్ట్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించాడు. నిజమే అని నమ్మిన ఫక్రుద్దీన్ క్విక్ సపోర్ట్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని అందులో తన మూడు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు నమోదు చేశాడు. వెంటనే ఫక్రుద్దీన్ మూడు ఖాతాల నుంచి రూ.78వేలకు పైగా నగదు మాయమైంది. తేరుకున్న ఫక్రుద్దీన్ వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
యూపీఐ ద్వారా అకౌంట్‌ను కొల్లగొట్టేస్తున్నారు...