తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటీపీ పేరుతో సైబర్​ మోసం.. 3.5 లక్షలు స్వాహా - ఓఎల్‌ఎక్స్‌, ఓటీపీ, క్రెడిట్ పేర్లతో సైబర్​ మోసం

సైబర్​ నేరగాళ్లు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. కొత్తకొత్త పద్ధతులతో గాలం వేసి మోసం చేస్తున్నారు. తాజాగా ఓఎల్‌ఎక్స్‌, ఓటీపీ పేర్లతో రూ.3.5 లక్షలు కాజేశారు. మరో కేసులో బంధువులకే అసభ్య మెసేజ్​లు పంపి ఓ వ్యక్తి అరెస్టయ్యారు.

cyber-fraud-with-otp-names-3-dot-5-lakh-in-hyderabad-areas
ఓటీపీ పేర్లతో సైబర్​ మోసం..3.5 లక్షలు స్వాహా

By

Published : Aug 6, 2020, 8:26 AM IST

ఓఎల్‌ఎక్స్‌, ఓటీపీ, క్రెడిట్ కార్డ్ పేరుతో సైబర్ నేరగాళ్లు 3.5 లక్షల రూపాయలను కొల్లగొట్టారు. ఈ మేరకు బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు.

మరో కేసులో బంధువులకే అసభ్య మెసేజ్​లు పంపిస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 40 ఏళ్లు నిండిన తనకు పెళ్లి కాకపోవడం వల్ల బంధువుల అమ్మాయినే ఓ ప్రభుద్దుడు వేధించడం ప్రారంభించాడు. బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఐపీ అడ్రస్ ఆధారంగా విద్యానగర్​కి చెందిన నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.

ఇదీ చూడండి :ఈటీవీ భారత్​ స్పందన: '‘పీఎం కిసాన్‌’'లో తెలంగాణకు చోటు

ABOUT THE AUTHOR

...view details