Cyber Fraud In Hyderabad: ఎన్ఎస్జీ కమాండో అని చెప్పి హైదరాబాద్ నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను సంప్రదించిన సైబర్ నేరగాడు ఇల్లు అద్దెకు కావాలంటూ రూ.2.41 లక్షలు కొట్టేశాడు. గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో నివాసముండే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్(Software Engineer) తన రెండు పడక గదుల ఇంటిని అద్దెకు ఇవ్వాలనుకున్నాడు. మ్యాజిక్ బ్రిక్ మొబైల్ యాప్‌లో ఇంటి వివరాలు, ఫోన్ నెంబరు నమోదు చేశాడు.
Fraud In The Name Of Army Hyderabad : సెప్టెంబరు 19వ తేదీన ఆశిష్ కుమార్ పహారీ పేరుతో ఫోన్ చేసిన ఓ వ్యక్తి తనని తాను ఎన్‌ఎస్‌జీ కమాండోనంటూ పరిచయం చేసుకున్నాడు. దిల్లీ నుంచి హైదరాబాద్‌కు బదిలీ అవుతున్నానని, ఇల్లు అద్దెకు కావాలని కోరాడు. ఆధార్, ఎన్‌ఎస్‌జీ గుర్తింపు, ఇతర కార్డులు పంపించాడు. ఆ తర్వాత ఆర్మీలో అకౌంటింగ్ అధికారినంటూ కెప్టెన్ రాజేంద్రసింగ్ షెకావత్ పేరుతో మరో వ్యక్తి ఫోన్ చేశాడు. ఆశిష్‌కుమార్ మీ ఇంట్లోకి అద్దెకు వస్తున్నాడని సమాచారముందని ధ్రువీకరించుకునేందుకు కాల్ చేసినట్లు చెప్పాడు.
Cyber Crimes Hyderabad: ఆర్మీ నిబంధనల ప్రకారం రెండు నెలల అడ్వాన్సు ఇవ్వాలంటే.. ఇంటి యజమాని ముందుగా తమకు డబ్బు పంపించాలని షెకావత్ చెప్పాడు. ఆ తర్వాత కమాండ్ కంట్రోల్ కేంద్రం(Command Control Center) నుంచి రెట్టింపు మొత్తం తిరిగి బదిలీ అవుతుందని చెప్పాడు. ఇదంతా నమ్మిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రెండు నెలల అడ్వాన్సు మొత్తం రూ.46 వేలు గూగుల్ పే నుంచి పంపాడు. నిర్ణీత మొత్తం కంటే రూ.5 ఎక్కువ పంపినందున ఈ సొమ్ము తిరిగి పంపే ప్రక్రియ ఆగిపోయిందని.. కేవలం రూ.45,995 మరోసారి పంపిస్తే మొత్తం డబ్బు బదిలీ చేస్తామని నమ్మించాడు.