మహిళలు, చిన్నారుల భద్రతకు పోలీస్ శాఖ తొలి ప్రాధాన్యం ఇస్తోందని మహిళా భద్రతా విభాగం డీఐజీ సుమతి పేర్కొన్నారు. సైబర్ నేరాల పట్ల మహిళలు, యువతకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. లాక్డౌన్ కాలంలో దాదాపు 70 శాతం సైబర్ మోసాలు పెరిగినట్లు వెల్లడించారు. సైబర్ నేరాల పట్ల మహిళలు, యువత అప్రమత్తంగా ఉండాలంటున్న డీఐజీ సుమతితో ఈటీవీ భారత్ ముఖాముఖి...
'లాక్డౌన్లో 70 శాతం సైబర్ మోసాలు పెరిగాయి' - cyber dig sumathi latest news
లాక్డౌన్ పుణ్యమా ఇంటి వద్దే పని చేసుకునే వారి సంఖ్య పెరిగింది. నెట్ వినియోగదారుల సంఖ్య రెట్టింపైంది. ఇదే సైబర్ నేరస్థులకు అవకాశంగా మారింది. అమాయకులైన మహిళలు, యువతకు రకరకాల ఆఫర్లు, బహుమతుల పేరుతో గాలం వేసి లక్షల్లో ముంచేస్తున్నారు. లాక్డౌన్ కాలంలో సైబర్ నేరాలు 70 శాతం పెరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

'లాక్డౌన్లో 70 శాతం సైబర్ మోసాలు పెరిగాయి'
'లాక్డౌన్లో 70 శాతం సైబర్ మోసాలు పెరిగాయి'