గూగుల్‌ను వేదికగా చేసుకొని కొంతమంది సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని... సైబరాబాద్ సీపీ సజ్జనార్ గూగుల్ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. గూగుల్‌లో నకిలీ కస్టమర్ కేర్ నెంబర్లు ఏర్పాటు చేసి... వాటి ద్వారా అమాయకులను నమ్మంచి డబ్బులు లాగేస్తున్నారని... సజ్జనార్ తెలిపారు. అంతేకాకుండా ఇతర మార్గాల్లోనూ... మోసాలు చేయడానికి సైబర్ నేరగాళ్లు గూగుల్‌ను ఎంచుకుంటున్నారని సీపీ అన్నారు.
ఈ విషయాలను గూగుల్ ప్రతినిధులు గీతాంజలి, సునీతా మెంహతీ దృష్టికి తీసుకెళ్లారు. సైబరాబాద్‌కు చెందిన పలువురు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి... గూగుల్ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ తరహా సైబర్ నేరాలను నిరోధించడానికి తమ సాంకేతిక సిబ్బంది పోలీసులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని... గూగుల్ ప్రతినిధి గీతాంజలి తెలిపారు.