Cyber criminals cheated stopware employee in Hyderabad : సైబర్ నేరగాళ్లపై పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న రోజుకో కొత్త అవతారంలో అమాయకపు ప్రజలను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాను ఆసరాగా చేసుకొని ఈ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కొన్ని లింక్లు పంపించడం వాటిని ఓపెన్ చేయడంటూ చెప్పడం.. ఆకర్షణీయ బహుమతులు మీ సొంతం అంటూ ప్రకటన చేయడం ఇలా అనేక పద్ధతిలో సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకొంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులకు కామెంట్లు ఇవ్వాలంటూ సైబర్ నేరగాళ్లు ఓ మహిళ నుంచి రూ.1.10 కోట్లు కొట్టేశారు. రేటింగ్ ఇస్తే రోజూ ఇంట్లో ఉండే సంపాదించవచ్చంటూ ఆమెను బోల్తా కొట్టించారు. పోలీసులు, బాధితురాలు కథనం ప్రకారం.. నగరంలోని పీరంచెరువు ప్రాంతంలో నివాసముండే సాప్ట్వేర్ ఉద్యోగినికి ఇటీవల టెలిగ్రామ్‌లో సందేశం వచ్చింది. తమ రిక్రూట్‌మెంట్ పార్ట్‌నర్ ద్వారా మీ ఫోన్ నెంబరు తెలిసిందని.. రేటింగ్, రివ్యూలు ఇవ్వడం ద్వారా ఆదాయం పొందొచ్చని సందేశంలో ఉంది.
- విద్యుత్ బిల్లు చెల్లించాలంటూ సందేశం.. నమ్మి ఫోన్ చేస్తే..
- CYBER CRIME: 'ఓటీపీ అవసరం లేకుండానే డబ్బును మాయం చేస్తున్నారు'
Cyber fraud with social media : సందేశంలో ఓ టెలిగ్రామ్ గ్రూప్ లింకును కూడా ఉంచారు. దానిని క్లిక్ చేసిన అనంతరం ఆమె టెలిగ్రామ్ గ్రూపులో యాడ్ అయింది. ఇదే క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో తాము సూచించిన పేజీకి కామెంట్లు ఇవ్వాలని ఓ వ్యక్తి టెలిగ్రామ్‌లో సందేశం పంపాడు. అతను చెప్పినట్లుగా బాధితురాలు కామెంట్లు చేసి స్క్రీన్ షాట్లు పంపించింది. తొలి టాస్కు పూర్తవ్వగానే బ్యాంకు ఖాతా వివరాలు పంపితే డబ్బు జమ చేస్తామంటూ మరో వ్యక్తి ఫోన్ చేశాడు. కొన్ని టాస్కుల తర్వాత ఆమెను నమ్మించేందుకు కొంత డబ్బు బ్యాంకు ఖాతాలో జమ చేశారు.