తెలంగాణ

telangana

ETV Bharat / state

రుణం ఇప్పిస్తానంటూ జవాన్​కు సైబర్​ కేటుగాడు టోకరా - cyber crime

లోన్​ పేరిట ఓ ఆర్మీ జవాన్​నే మోసగించాడు ఓ సైబర్​ కేటుగాడు. రుణం కోసం పలు ఛార్జీలు చెల్లించాలంటూ జవాన్​ నుంచి 4 లక్షల 31 రూపాయలను దోచుకున్నాడు. మోసపోయానని ఆర్మీ జవాన్​ హైదరాబాద్​ సీసీఎస్​ పోలీసులను ఆశ్రయించాడు.

cyber criminals cheat army jawan in hyderabad
రుణం ఇప్పిస్తానంటూ జవాన్​కు సైబర్​ కేటుగాడు టోకరా

By

Published : May 11, 2020, 8:38 PM IST

రుణం పేరుతో ఆర్మీ జవాన్​ను సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు. బజాజ్ అలియాంజ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని... సికింద్రాబాద్​ తిరుమలగిరి లాల్​బజార్​లో ఉన్న ఆర్మీ ఆఫీసులో పనిచేస్తున్న అశ్విన్ కుమార్ అనే జవాన్​కు సైబర్ నేరగాడు ఫోన్ చేశాడు. నిజమే అనుకొని అతను చెప్పినట్లుగా సంబంధించిన డాక్యుమెంట్​ను జవాన్ పంపించారు. రుణం కోసం ప్రాసెసింగ్ ఛార్జ్​, డాక్యుమెంట్ ఛార్జ్, జీఎస్టీ, పలు పేర్లతో 4 లక్షల 31 రూపాయలు వసూలు చేశాడు.

లోన్ ఎప్పటివరకు వస్తుందని పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడం వల్ల మోసపోయానని గ్రహించాడు. హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆర్మీ ఉద్యోగి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న సైబర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: గర్భిణీ మృతి ఘటనపై హైకోర్టుకు ప్రభుత్వ నివేదిక

ABOUT THE AUTHOR

...view details