తెలంగాణ

telangana

ETV Bharat / state

పేటీఎం నుంచి అన్నారు.. పైసలన్నీ దోచుకెళ్లారు... - sr nagar latest News

హైదరాబాద్​ మహా నగరంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కరోనా లాక్​డౌన్ మెుదలు ఇప్పటికీ సైబర్ చోరీలు వీపరీతంగా నమోదవుతున్నాయి. తాజాగా ఎస్సార్ నగర్ పరిధికి చెందిన ఓ వ్యక్తికి పేటీఎం నుంచి ఫోన్ చేశామని చెప్పి రహస్య వివరాలు రాబట్టారు. ఇంకేముంది అందినకాడికీ సొమ్ము దోచుకెళ్లారు.

పేటీఎం నుంచి అన్నారు.. పైసలన్నీ దోచుకెళ్లారు
పేటీఎం నుంచి అన్నారు.. పైసలన్నీ దోచుకెళ్లారు

By

Published : Jul 31, 2020, 4:15 PM IST

హైదరాబాద్ ఎస్సార్ నగర్ ప్రాంతానికి చెందిన సత్యనారాయణకు పేటీఎం నుంచి మాట్లాడుతున్నామంటూ ఫోన్ వచ్చింది. సంస్థ ప్రతినిధులుగా మాట్లాడిన సైబర్ నేరగాళ్లు తొలుత కేవైసీ వివరాలు అప్​డేట్ చేయాలని సత్యనారాయణను కోరారు. ఇందుకు గానూ బాధితుడి ఫోన్​లో ఎనీడెస్క్ యాప్ డౌన్​లోడ్ చేయించారు.

మొత్తం రూ లక్షా 46 వేలు మాయం..

మొదట డెబిట్, క్రెడిట్ కార్డుల నుంచి ఒకటి చొప్పున పేటీఎం లావాదేవీలు చేయించారు. బాధితుడి రహస్య వివరాలు రాబట్టి, పేటీఎంను సంగ్రహించిన సైబర్ నేరగాళ్లు రెండింటి నుంచి రూ.లక్షా 46 వేలు మాయం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చూడండి : ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వం నిఘా పెట్టాలి: చాడ

ABOUT THE AUTHOR

...view details