సైబర్ నేరాలు ఆగడం లేదు... రోజూ పదుల సంఖ్యలో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. వారు అవలంబించే తీరుపై అవగాహన పెంచుకునే లోపే కొత్త ఎత్తుగడలతో డబ్బులు కొల్లగొడుతున్నారు. తాజాగా టిఫిన్స్ అందజేయాలంటూ ఓ మహిళను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. తమ కంపెనీ ఉద్యోగులకు టిఫిన్లు అందించాలంటూ ఓ మహిళకు ఫోన్ వచ్చింది. అకౌంట్ నంబర్ పంపిస్తే అడ్వాన్స్ డబ్బులు పంపిస్తామని తెలిపారు.
భారీగా ఫుడ్ ఆర్డర్లు.. పెద్ద మొత్తంలో నగదు లూఠీ - cyber crimes increasing in hyderabad
సైబర్ నేరగాళ్ళు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త తరహా ఎత్తుగడలతో లూఠీ చేస్తున్నారు. తాజాగా తమ కంపెనీకు టిఫిన్స్ అందించాలంటూ ఓ మహిళను మోసం చేశారు.

భారీగా ఫుడ్ ఆర్డర్లు.. పెద్ద మొత్తంలో నగదు లూఠీ
నిజమేననుకుని నమ్మిన బాధితురాలు.. అకౌంట్ వివరాలు తెలిపారు. డబ్బులు ట్రాన్స్ఫర్ చేశానని.. మహిళకు క్యూఆర్ కోడ్‌ను పంపించాడు. దాన్ని క్లిక్ చేయగానే రూ. 60 వేల నగదు మాయమయ్యాయి. ఇదంతా మోసమని తెలుసుకున్న బాధితురాలు సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, మీడియా సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా... వేల సంఖ్యలో వారి బారిన పడుతున్నారు.