తెలంగాణ

telangana

ETV Bharat / state

సైబర్ క్రైమ్: 3 రోజుల్లో రూ.36 లక్షలు ఖల్లాస్

లాక్​డౌన్​ వల్ల సైబర్​ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. కేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చేసే మోసాల పట్ల అవగాహన పెంచుకునేలోపు.. కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. యూపీఐ, వాలెట్లను ఉపయోగిస్తున్న ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని నగదు కొల్లగొడుతున్నారు.

cyber crimes increasing day to day in hyderabad
వ్యాపారి ఖాతాల్లోంచి మూడు రోజుల్లో రూ.36 లక్షలు!

By

Published : May 24, 2020, 10:33 AM IST

లాక్‌డౌన్‌ అమల్లోనూ రాత్రింబవళ్లూ మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరస్థులు సికింద్రాబాద్‌లో నివాసముంటున్న ఒక ఇనుము వ్యాపారి ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఖాతాలోంచి రూ.36 లక్షలు కొట్టేశారు. సంతోష్‌ శర్మ, జితేందర్‌, సందీప్‌ పేర్లతో ఉన్న బ్యాంకు ఖాతాల్లోకి మూడు రోజుల్లో రూ.36 లక్షలు బదిలీ చేసుకున్నారు. బ్యాంక్‌ అధికారులు ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఎక్కువగా వాడుతున్నారంటూ ఫోన్‌ చేయడంతో వ్యాపారికి అనుమానం వచ్చి లావాదేవీలను పరిశీలించగా... తాను బదిలీ చేసినట్టే ఉన్నాయి.చరవాణికి ఓటీపీలు రానందున.. ఇదంతా సైబర్‌ నేరస్థులు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారని సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు.

లబ్ధిదారులు(బెనిఫిషియరి)గా చేరి...

ఇనుము వ్యాపారికి సికింద్రాబాద్‌లోని జాతీయ బ్యాంకుల్లో మూడు ఓవర్‌డ్రాఫ్ట్‌ ఖాతాలున్నాయి. ఇవి ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ఖాతాలే. వ్యాపారి ఈ-మెయిల్‌ వివరాలు తెలుసుకున్న నైజీరియన్లు అతడి పాస్‌వర్డ్‌ ద్వారా మెయిల్‌ హ్యాక్‌ చేశారు. బ్యాంక్‌ ఖాతా పాస్‌వర్డ్‌నూ తెలుసుకున్న నైజీరియన్లు సంతోష్‌ శర్మ, జితేందర్‌, సందీప్‌ పేర్లను వ్యాపారి ఓవర్‌డ్రాఫ్ట్‌ ఖాతాలకు లబ్ధిదారులుగా చేర్చారు. మూడు రోజుల్లో మూడు ఖాతాల నుంచి తమ ఖాతాలకు నగదు బదిలీ చేసుకున్నారు.

ఫోన్‌ చేసి.. బురిడీ కొట్టించి..

నగదు లావాదేవీలు నిర్వహించుకునేందుకు ఫ్రాంఛైజీ ఇస్తామని ఓ వ్యక్తిని సైబర్‌ నేరస్థుడు మోసం చేశాడు. పాతబస్తీకి చెందిన అబ్దుల్‌ బారీకి సైబర్‌ నేరస్థుడు ఫోన్‌ చేసి సీఎస్‌సీ (కామన్‌ సర్వీస్‌ సెంటర్‌) మీ ప్రాంతంలో ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉందని నమ్మించాడు. డిపాజిట్‌, రుసుంల పేరుతో రూ.65వేలు వసూలు చేసి.. మరి కొంత నగదు డిమాండ్‌ చేయడంతో అనుమానం వచ్చి బాధితుడు నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో కేసులో నగరానికి చెందిన ఓ వ్యక్తికి రూ.25లక్షల లాటరీ వచ్చిందని.. బ్యాంకు ఖాతాలు తెరవాలని..వివిధ ఛార్జీల పేరిట సైబర్‌ నేరస్థులు రూ.94వేలు వసూలు చేశారు.

ఇదీ చదవండిఃపెన్​గంగ నది మధ్యలో యథేచ్ఛగా ఇసుక దందా

ABOUT THE AUTHOR

...view details