తెలంగాణ

telangana

ETV Bharat / state

కేటుగాళ్లు మరణించిన వారినీ వదలట్లేదు.! - cyber cheating in Hyderabad

సైబర్​ నేరాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా... రోజూ పదుల సంఖ్యలో పోలీసులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. సైబర్ నేరగాళ్లు.. రోజుకో కొత్త పంథాను అనుసరిస్తూ అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. చివరికి మరణించిన వారి ఖాతాల నుంచి కూడా నగదు కాజేస్తున్నారు.

హైదరాబాద్​లో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్​లో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు

By

Published : Jun 11, 2020, 6:43 AM IST

తన సమీప బంధువు క్రాంతి కుమార్ చనిపోయిన 15 రోజుల అనంతరం అతని ఖాతా నుంచి రూ.15 లక్షల నగదు ఆన్​లైన్​ ద్వారా బదిలీ అయిందని హైదరాబాద్​ అబిడ్స్​కు చెందిన ఓ డాక్టర్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఎవరు బదిలీ చేశారో తెలుసుకుని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఓఎల్​ఎక్స్​లో వస్తువుల పేర్లతో, ఓటీపీ ద్వారా, కేవైసీ ఆప్​డేట్​ పేరుతో మోసపోయామంటూ సైబర్ క్రైం పోలీసులకు బాధితులు రోజూ క్యూ కడుతూనే ఉన్నారు. తాజాగా ఈ తరహా కేసుల్లో సైబర్ నేరగాళ్లు ఐదుగురి నుంచి రూ.4 లక్షలు లూఠీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details