చిన్న వయసు నుంచే సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తే నేరాలను పూర్తిగా అరికట్టే అవకాశం ఉందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. మాదాపూర్ హెచ్ఐసీసీ నోవోటెల్ లో సైబరాబాద్ పోలీసులు, సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో 'సైబర్ సెక్యూరిటి కాంక్లేవ్ 5.0' సదస్సు నిర్వహించారు. సదస్సును సైబరాబాద్ సీపీ సజ్జనార్, సైబర్ సెక్యూరిటి కౌన్సిల్ ఛైర్మన్ భరణి, మైక్రోసాఫ్ట్ ఎండీ, ఐడీసీ రాజీవ్ కుమార్, సెర్ట్ ఇన్ డైరెక్టర్ జనరల్ సంజయ్ బహల్ ప్రారంభించారు.
'సైబర్‌నేరాల నియంత్రణపై శ్రద్ధ అవసరం' - సీపీ సజ్జనార్ తాజా వార్త
హైదరాబాద్ మాదాపూర్‌లో సైబర్ సెక్యూరిటీపై సదస్సును నిర్వహించారు. దీనిలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి పలు అంశాలను చర్చించారు.
సైబర్ నేరాల అదుపు, భవిష్యత్తులో సైబర్ క్రైమ్‌లో ఎదురయ్యే సవాళ్లు... వాటి పరిష్కార మార్గాలపై సదస్సులో చర్చించనున్నారు. గత ఐదేళ్లుగా ఈ కాన్ఫరెన్స్ నిర్వాహిస్తున్నామని.. వివిధ రాష్ట్రాల నుంచి ఐపీఎస్ అధికారులు, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు కాన్ఫరెన్స్ కి హాజరయ్యారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయని. ఈ మధ్య కాలంలో మహిళలు ఎక్కువగా నష్టపోతున్నారని సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఛైర్మన్ భరణి అన్నారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: తెలంగాణ ఓటర్లలో పోటెత్తిన చైతన్యం