సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సైబర్ క్రైం పోలీసుల కోసం నిర్వహిస్తున్న సదస్సు నేటితో ముగిసింది. డార్క్‌వెబ్ పై దేశవ్యాప్తంగా జరిగిన సదస్సుల్లో ఇది అతి పెద్దది. దీనికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, రాజస్తాన్, పశ్చిమ బంగా, దిల్లీ తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన సైబర్ క్రైమ్స్ పోలీసులు హాజరయ్యారు. డార్క్‌వెబ్‌లో వెబ్ హోస్ ద్వారా ఎలా సెట్ చేయాలి వంటి విషయాలను వివరించారు. ఇజ్రాయిల్‌కు చెందిన సైబర్ క్రైమ్ నిపుణులు డాట్ నెట్లో వివిధ టూల్స్ ద్వారా ఎలా సెర్చ్ చేయాలో శిక్షణ ఇచ్చారు.
ముగిసిన సైబర్ క్రైం సదస్సు - ముగిసిన సైబర్ క్రైం సదస్సు
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో డిజిపోల్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న సైబర్ క్రైం సదస్సు ముగిసింది. సమావేశంలో ముఖ్యంగా డీప్ వెబ్, డార్క్‌నెట్‌లో సైబర్ నేరాలకు పాల్పడే వారిని ఎలా గుర్తించాలి వంటి అంశాలు నేర్పించారు.
ముగిసిన సైబర్ క్రైం సదస్సు