సైబర్ మోసగాళ్లు రోజుకో రకమైన సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు సరఫరా చేస్తామని చెప్పి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరానికి చెందిన సిద్ధ ఎంటర్ ప్రైజెస్ యజమానైనా సిద్ధార్థని సైబర్ కేటుగాళ్ల ఈవిధంగానే మోసం చేశారు.
Cyber crime: ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల పేరుతో సైబర్ మోసం - Telangana news
అవసరమే వాళ్ల ఆయుధం.. ఆశే వాళ్లకు ఎర. ఎన్నో రకాలుగా ప్రజలను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు.. తాజాగా మరొక రూపంలో మోసానికి తెగబడ్డారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు సరఫరా చేస్తామని చెప్పి రూ.2.93 లక్షలు కాజేశారు.
![Cyber crime: ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల పేరుతో సైబర్ మోసం Oxygen Concentrate Supply cyber crime](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:56:56:1622168816-11925044-cyber.jpg)
సిద్ధార్థకి ఫేస్ బుక్ ద్వారా ‘ఫిలిప్స్ ఇండియా గ్లోబల్ డిస్ట్రిబ్యూటర్' తనదంటూ రీతూ పేరుతో సైబర్ నేరగాడు పరిచయం చేసుకున్నాడు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు సరఫరా చేస్తామని నమ్మించి సిద్ధార్థ నుంచి రూ.2.93 లక్షలు వసూలు చేశాడు. అయితే పరికరాలు ఎంతకూ రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మన అవసరాన్ని ఆసరాగా తీసుకొని మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్త పడాలని పోలీసులు సూచిస్తున్నారు.