సాంకేతికతను ఉపయోగించుకోవడం వల్ల ఎంతో అభివృద్ధి జరుగుతోందని.... యువత ఆధునిక సాంకేతికతను సొంతం చేసుకొని దేశాన్ని మరింత పురోగతి సాధించేలా చూడాలని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. అంతర్జాలం వల్ల ప్రపంచం చిన్నదైపోయిందని.... అంతరిక్షాన్ని కూడా చేరుకుంటున్న తరుణంలో... సాంకేతికతను అందిపుచ్చుకోకపోతే వెనకపడిపోతామని అంజనీకుమార్ తెలిపారు. నేరాలు సైతం కొత్త పుంతలు తొక్కుతున్నాయని... సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారని అంజనీ కుమార్ స్పష్టం చేశారు. సైబర్ నేరాలబారిన పడకుండా ఉండాలంటే... సరైన అవగాహనతో పాటు జాగ్రత్తలు తీసుకుంటే చాలని సూచించారు. నగరంలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు.... హైదరాబాద్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, నివారణ చర్యలపై ఆరు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించి అందులో ఎంపికైన 100 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. సైబర్ నిపుణులు రక్షిత్ టాండన్ ఆధ్వర్యంలో ఈ శిక్షణా కార్యక్రమం కొనసాగనుంది. శిక్షణ పొందిన విద్యార్థులు... వారి వారి కళాశాలలకు వెళ్లి అవగాహన కార్యక్రమాలు కల్పించనున్నారు.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ - సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ
హైదరాబాద్లోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు.. హైదరాబాద్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, నివారణ చర్యలపై ఆరు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీపీ అంజనీ కుమార్ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ