రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ను ఆసరాగా చేసుకుని... మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు. పేటీఎమ్ కేవైసీని అప్డేట్ చేయాలంటూ అధికంగా మోసాలు జరుగుతున్నాయి. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతూ... నిరుద్యోగుల నుంచి ఫీజుల పేరుతో డబ్బులు దండుకుంటున్నారు. ఈ నేరాలు జరుగుతున్న తీరుపై సైబారాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శ్రీనివాస్ కుమార్‌తో... ఈటీవీ భారత్ ముఖాముఖి...
'ఓటీపీలు చెప్పి మోసపోకండి.. ఏది మోసమో గ్రహించండి' - సైబర్ నేరాలపై అవగాహన
కేవైసీ అప్డేట్ చేయాలంటూ ఫోన్ చేసి... లింక్‌ల ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. మాస్క్‌లు, శానిటైజర్లు తక్కువ ధరకు ఇస్తామని డబ్బులు దండుకుంటున్నారు. వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం ఏసీపీ శ్రీనివాస్ సూచిస్తున్నారు. ఆన్లైన్ మోసాల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
!['ఓటీపీలు చెప్పి మోసపోకండి.. ఏది మోసమో గ్రహించండి' cyber-crime-acp-srinivas-gives-precautions-on-cyber-crimes-in-lock-down-period](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7747389-thumbnail-3x2-cyber.jpg)
'ఓఎల్‌ఎక్స్, మ్యాట్రిమోని, బీమా పాలసీల పేరుతో మోసాలు'