తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆన్​లైన్​లో వస్త్రాలు కొనుగోలు పేరుతో.. దుకాణ యజమాని డబ్బే కొట్టేసింది

ఫోన్​లో వస్తాలు బేరమాడీ... ఆన్​లైన్​లో డబ్బులు పంపిస్తానని చెప్పి క్యూఆర్​ కోడ్​ ద్వారా... ఓ వస్త్ర దుకాణం యజమాని ఖాతా నుంచి లక్షా 28 వేలు కాజేసింది ఓ కిలేడి. మోసపోయిన బాధితుడు హైదరాబాద్​ సైబర్​ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆన్​లైన్​లో వస్త్రాలు కొనుగోలు పేరుతో.. దుకాణ యజమాని డబ్బే కొట్టేసింది
ఆన్​లైన్​లో వస్త్రాలు కొనుగోలు పేరుతో.. దుకాణ యజమాని డబ్బే కొట్టేసింది

By

Published : Jul 29, 2020, 8:22 PM IST

సైబర్​ క్రైం మోసాలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఇంత సులువుగా ఎలా మోసం చేస్తారా అనే అనుమానం రావడం సహజం... రోజు ఎన్నో చూస్తున్నా... చదువుతున్నా.. ఎంత తెలివైన వారైన సులువుగా మాయగాళ్ల బుట్టలో పడిపోతున్నారు. తాజాగా హైదరాబాద్​ చార్మినార్​ వద్ద ఓ వస్త్ర దుకాణం యజమాని ఖాతా నుంచి 1,28,000 కాజేసింది ఓ మాయలేడి.

అసలు ఏమైందంటే...

పవన్ అగర్వాల్​కు చార్మినార్ వద్ద వస్త్ర దుకాణం ఉంది. బుధవారం అతనికి ఓ మహిళ ఫోన్​ చేసి తాను డిఫెన్స్​ అధికారిణి అంటూ పరిచయం చేసుకుని... వీడియో కాల్​ చేస్తాను చీరలు, సూట్​లు చూపించాలని కోరింది. సుమారు 54వేల విలువైన వస్త్రాలు ఎంపిక చేసుకుంది. వాటిని ప్యాక్ చేయించి... బిల్లు సిద్ధం చేయాలని కోరగా అలాగే చేశాడు.

డబ్బులు పంపిస్తే వెంటనే డెలివరీ ఇచ్చేస్తామని పవన్​ అగర్వాల్​ ఆమెకు చెప్పాడు. ఆన్​లైన్​లో వెంటనే పంపిస్తానంటూ క్యూఆర్ కోడ్ పంపింది. దానిని స్కాన్​ చేయగానే క్షణాల్లోనే అతని బ్యాంక్ ఖాతా నుంచి 1,28,000 వేలు డ్రా అయినట్లు సందేశం వచ్చింది. మహిళకు ఫోన్​ చేయగా స్విచ్ఛాఫ్​ వచ్చింది. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు హైదరాబాద్​ సైబర్​ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇదీ చూడండి..

లారీని ఢీకొట్టిన కారు... ఎస్‌బీఐ ఉద్యోగి సజీవదహనం

ABOUT THE AUTHOR

...view details