మ్యాట్రిమోనీ నుంచి ప్రవాస భారతీయునికి ప్రేమతో దగ్గరైంది. నా దగ్గర చాలా ఆస్తి ఉంది.. కానీ అవి రావాలంటే పెళ్లికావాలంది. ఆస్తులకు సంబంధించి చట్టపరమైన సమస్యలు తొలగించుకునేందుకు డబ్బులు కావాలంది. నమ్మిన ఆ వ్యక్తికి నష్టమే మిగిలింది. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఆమెను.. ఇందుకు సహకరించిన కొడుకును అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి భర్త పరారీలో ఉన్నాడు.
ఏం చేశారంటే...
విలాసానికి అలవాటుపడిన ఓ కుటుంబం... ప్రవాసభారతీయుడిని మోసం చేసి రూ. లక్షల్లో డబ్బులు దోచుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌కు చెందిన మాళవిక ఓ మ్యాట్రిమోనీలో నకిలీ అకౌంట్‌ను తెరిచింది. తన పేరు కీర్తి అని వైద్యురాలిగా నమోదు చేసుకుంది. ఇందుకు భర్త, కుమారుడు తమ వంతు సహాయమందించారు. క్యాలిఫోర్నియాకు చెందిన వరుణ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమె ప్రొఫైల్ చూసి చాటింగ్ ప్రారంభించాడు.