సులభంగా డబ్బు సంపాదించాలన్న అత్యాశతో యువత అడ్డదారులు తొక్కుతున్నారు. సామాజిక మాధ్యమాలు యువతకు ఎంత ఉపయోగపడుతున్నాయో తెలియదు కానీ... వారి అతితెలివికి మాత్రం ఆయుధాలుగా మారుతున్నాయి. ఉన్నత చదువులు చదివిన ఓ యువతి సరికొత్త వ్యూహంతో మోసానికి పాల్పడింది.
పాఠశాలలే తన టార్గెట్...
పలు ప్రైవేట్ స్కూళ్లకు చెందిన అధికారిన ఫేస్బుక్ పేజీల నుంచి ఫొటోలనే ఆయుధంగా మార్చుకుంది ఆ కిలేడి. సమావేశాలు, వేడుకలకు సంబంధించిన ఫొటోలు మార్ఫింగ్ చేసి... యాజమాన్యానికి పంపిస్తోంది. తాను సైబర్ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్నట్లు వారిని నమ్మించి... సామాజిక మాధ్యమాల నుంచి ఆ ఫొటోలను తీసేసేందుకు అడ్డగోలుగా డబ్బు వసూలు చేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్లోని కొన్ని స్కూళ్లను కూడా డిమాండ్ చేసింది. పాఠశాలల యాజమాన్యాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... అసలు విషయం బయటపడింది.