తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫ్యాన్సీ నంబర్లంటూ మోసం... - hyderabad cyber crim police

ఓ టెలికాం కంపెనీ సీఈవో అంటూ ప్రముఖులను ఫ్యాన్సీ నంబర్ల పేరుతో మోసం చేస్తున్న వ్యక్తిని సైబర్​ క్రైం పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడి నుంచి ఆ సంస్థ లోగోలు స్వాధీనం చేసుకున్నారు.

ఫ్యాన్సీ నెంబర్లంటూ మోసం..

By

Published : Oct 15, 2019, 5:45 PM IST

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన దీపుబాబు బీటెక్​ మధ్యలోనే మానేశాడు. బెంగళూరులో ఉంటున్న అతను ఓ టెలికాం కంపెనీ యాడ్​ చూశాడు. ఈ యాడ్​ ఉపయోంగించుకుని ప్రముఖుల వద్ద డబ్బు గుంజొచ్చని పథకం వేశాడు. శాసనసభ్యులు, లోక్​సభ సభ్యుల పీఏలకు ఫోన్ చేసి మీకు నచ్చిన ఫ్యాన్సీ నంబర్ కోరుకోండి.. 48 గంటల్లో పంపిస్తామని చెప్పి వేలల్లో డబ్బులు గుంజాడు. వచ్చిన సొమ్ముతో రేస్ కోర్సు మైదానాలకు వెళ్లి లక్షల్లో పందెం కాసేవాడు.

ఫిర్యాదు

నిందితుడిపై వ్యాపారి రామ్మోహన్సైబర్​ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు దీపుబాబును అరెస్ట్​ చేశారు. అతని నుంచి ఆ కంపెనీ లోగోలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఫ్యాన్సీ నంబర్లు ఇస్తానంటూ నెల్లూరు, చిత్తూరు, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్​నగర్, కర్నూలు జిల్లాలకు చెందిన కొంత మంది ప్రజాప్రతినిధులను మోసం చేసినట్లు తెలిసింది.

ఇదీ చూడండి: ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మృతి

ABOUT THE AUTHOR

...view details