సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆరంఘర్ చౌరస్తా, శివరాంపల్లి, అత్తాపూర్ ప్రధాన రహదారులపై ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను తనిఖీ చేశారు. స్వయంగా వాహనాల ఆపి వివరాలను సేకరించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులను గుర్తించి వారి వాహనాలను జప్తు చేశారు.
ప్రార్థనలను ఇళ్లలోనే జరుపుకోవాలి: సీపీ సజ్జనార్ - సైబరాబాద్ సీపీ సజ్జనార్ వార్తలు
ముస్లిం సోదరులు రంజాన్ ప్రార్థనలను తమ ఇళ్లలోని నిర్వహించుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కోరారు. ఆరంఘర్ చౌరస్తా, శివరాంపల్లి, అత్తాపూర్ ప్రధాన రహదారులపై ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను తనిఖీ చేశారు.
చెక్ పోస్టులు పరిశీలిస్తున్న సీపీ సజ్జనార్
ప్రజలు లాక్‌డౌన్‌కు పూర్తిగా సహకరిస్తున్నారని అన్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఉంటే ఈ పాస్ ద్వారా దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్న కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి తమ వివరాలను అందించాలని సూచించారు. ముస్లిం సోదరులు రంజాన్ ప్రార్థనలను తమ ఇళ్లలోని నిర్వహించుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధి పెంపు!