దొంగలు చోరీ చేసిన చరవాణిలను సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీపీ సజ్జనార్ సెల్‌ఫోన్లను యజమానులకు అందజేశారు. దాదాపు 200కిపైగా చరవాణిలను బాధితులకు అందజేసినట్లు చెప్పారు. క్రైమ్స్ వింగ్ పోలీసు అధికారులు, సిబ్బంది చాకచక్యంగా సెల్‌ఫోన్లను కనిపెట్టారని వారిని ప్రశంసించారు.
మీ మొబైల్స్ జాగ్రత్తగా ఉంచుకోండి: సీపీ సజ్జనార్ - హైదరాబాద్ తాజా వార్తలు
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీసు స్టేషన్లలో చరవాణిలు పోగొట్టుకొన్న వారికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తిరిగి వాటిని అందజేశారు. చరవాణిల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
మొబైల్స్ జాగ్రత్తగా ఉంచుకోండి: సీపీ సజ్జనార్
ఎలక్ట్రానిక్ పరికరాలు విషయంలో..సెల్‌ఫోన్ల విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ ప్రజలకు సూచించారు. ప్రజల జీవితాల్లో చరవాణిలు కిలక పాత్ర పోషిస్తున్నాయని... వ్యక్తిగత డేటాను వాటిలో భద్రపరుస్తున్నారని తెలిపారు. అవి నేరస్థుల చేతుల్లోకి పోతే వారు దుర్వినియోగం చేస్తారని.. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఆర్ఎస్ఐ సంతోష్ కుమార్ పాల్గొన్నారు.