CWC Meetings Schedule Hyderabad 2023 :హైదరాబాద్‌లో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశాల షెడ్యూల్‌ను (CWC Meetings Schedule) ఏఐసీసీ విడుదల చేసింది. ఈ నెల 16న మధ్యాహ్నం 1:00 గంటలకు టీపీసీసీ ఇచ్చే లంచ్‌కు సీడబ్ల్యూసీ సభ్యులు హాజరుకానున్నారు. అదేరోజు మధ్యాహ్నం 2:00 గంటలకు హోటల్ తాజ్‌కృష్ణలో సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం కానుంది. 17న ఉదయం 10:30 గంటలకు ఎక్సెటెండెడ్ సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. సాయంత్రం 5:00 గంటలకు టీపీసీసీ ఆధ్వర్యంలో తుక్కుగూడలో నిర్వహించే విజయభేరీ బహిరంగ సభలో సీడబ్ల్యూసీ, అన్ని రాష్ట్రాల పీసీసీ, సీఏల్పీ నేతలు పాల్గొంటారు. 18న ఎంపీలు మినహా మిగతా నాయకులంతా 119 నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు తెలిపింది.
సీడబ్ల్యూసీ సమావేశాల షెడ్యూల్..
- ఈ నెల 16న మధ్యాహ్నం 1:00 గంటలకు.. టీపీసీసీ ఇచ్చే లంచ్‌కు హాజరుకానున్న సీడబ్ల్యూసీ సభ్యులు
- 16న మధ్యాహ్నం 2:00 గంటలకు హోటల్ తాజ్‌కృష్ణలో సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం
- 17న ఉదయం 10:30 గంటలకు ఎక్సెటెండెడ్ సీడబ్ల్యూసీ సమావేశం
- 17న సాయంత్రం 5:00 గంటలకు టీపీసీసీ ఆధ్వర్యంలో తుక్కుగూడలో నిర్వహించే సభకు హాజరుకానున్న నేతలు
CWC Meetings in Hyderabad on September 16th :సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహణపై ఇటీవలే పీసీసీ నేతలకు కేసీ వేణుగోపాల్పలు సూచనలు చేశారు. ఈ సమావేశాలతో దేశంలో 2024 లో జరగనున్న ఎన్నికలకు ఇక్కడనే కార్యాచరణ సిద్ధమవుతుందని అన్నారు. ఈ నెల 16, 17న తాజ్‌కృష్ణలో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశాలకు.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీలతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge) ,అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరుకానున్నట్లు.. ఇందుకోసం పటిష్ఠ భద్రత కల్పించాలని డీజీపీని కోరినట్లు రేవంత్ రెడ్డి(Revanth Reddy) వివరించారు.