CWC Meeting Started at Hyderabad : హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) సమావేశాలు ప్రారంభమయ్యాయి. హోటల్ తాజ్‌కృష్ణలో జరుగుతున్న సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియాగాంధీ హాజరయ్యారు. ఈ సమావేశాలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. తాజ్‌కృష్ణ ప్రాంగణంలోభారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) చిత్రాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు హైదరాబాద్‌కు వచ్చారు. కాంగ్రెస్ అగ్రనేతలకు శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర నేతలు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ అగ్ర నేతల రాక సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో భారీ భధ్రతను ఏర్పాటు చేశారు. సీఆర్పీఎఫ్ పోలీసులతో పాటు, రాష్ట్ర పోలీసులు భారీగా మోహరించారు.
CWC Meeting at Hyderabad :మధ్యాహ్నం సమయంలో విమానాశ్రయానికి చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలకు కేసీ వేణుగోపాల్, ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, వీహెచ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలు పూలబొకేలు అందించి స్వాగతం పలికారు. అంతకు ముందు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బగెల్, కర్ణాటక సీఎం సిద్ధారామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, కర్ణాటక మాజీ సీఎం వీరప్ప మొయిలీ, మాజీ కేంద్ర మంత్రి చిదంబరంలు, సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ సభ్యులు విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన ఖర్గే సీడబ్ల్యూసీ సమావేశాలను ప్రారంభించారు.
CWC Meeting in Hyderabad Today : హైదరాబాద్‌లో ఇవాళ, రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు