CWC Leaders Promoting 6 Guarantees in Telangana :తుక్కుగూడలో నిర్వహించిన విజయభేరి సభ కాంగ్రెస్(Congress) శ్రేణుల్లో నూతనోత్సాహం పెంచింది. తెలంగాణలోనూ కర్ణాటక గెలుపు మంత్రాన్ని అస్త్రంగా ప్రయోగించి.. రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. సీడబ్ల్యూసీ సమావేశాల వేళ తుక్కుగూడ విజయభేరి వేదికగా ప్రకటించిన 6 గ్యారెంటీలతో కాంగ్రెస్ నేతలు ఇంటింటినీ సందర్శిస్తున్నారు.
Rahul Gandhi At Congress Vijayabheri Sabha : '100 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంటికే'
Congress 6 Guarantee Schemes in Telangana :నిన్న, మొన్న రెండు రోజుల పాటు సీడబ్ల్యూసీ(CWC Meetings) సమావేశాలు, విజయభేరి సభ అనంతరం.. సోనియాగాంధీ ప్రకటించిన ఆరు హామీల గ్యారెంటీ కార్డును ఇంటింటికీ తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగానే సీడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నేతలు వారికి కేటాయించిన నియోజకవర్గాలకు నిన్న రాత్రి బయలుదేరి వెళ్లారు.
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు ఎదురు చూస్తున్నారని రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ అన్నారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సచిన్ పైలెట్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గం పరిధిలోని యూసుఫ్‌బాబా దర్గా నుంచి హనుమాన్ మందిర్ వరకు ఇంటింటికీ 6 గ్యారెంటీలు పేరుతో నిర్వహించిన ర్యాలీలో సచిన్ పైలెట్ పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ప్రజలు కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉన్నారని సచిన్ పేర్కొన్నారు.
CWC Meeting Hyderabad 2023 : తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో విజయంపై సీడబ్ల్యూసీ ధీమా
Telangana Congress Latest News :ప్రజల జీవన విధానంలో మార్పు కోసమే కాంగ్రెస్ పార్టీ భరోసా పథకాలని.. సీడబ్ల్యూసీ సభ్యురాలు, మహారాష్ట్ర ధారవి ఎమ్మెల్యే వర్ష ఏక్నాథ్ గైక్వాడ్ అన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గం కింగ్ కోఠిలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్రెడ్డి, హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డిలతో కలిసి పర్యటించారు. నిన్న విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు హామీలను ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తూ.. కర్ణాటక తరహాలో పథకాలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్, బీజేపీ, ఓవైసీ మూడు పార్టీలూ ఒకే గూటికి చెందిన పక్షులని.. ఓట్ల కోసం ప్రజలను మభ్యపెడుతున్నారని సీడబ్ల్యూసీ సభ్యుడు లాల్‌జీ దేశాయ్ అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు వాగ్ధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాడానికి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్లో కేసీఆర్, బీజేపీలో మోదీ, అమిత్‌షా అధికారాన్ని తమ చేతిలో పెట్టుకుని.. మిగిలిన వారికి మాట్లాడే హక్కు కూడా లేకుండా చేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీ అని.. అందరికీ పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఇంటికి పోవడం.. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
"తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు ఎదురు చూస్తున్నారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలోనూ.. ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తాం". - సచిన్ పైలట్, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి
నియోజకవర్గాల బాటపట్టిన ముఖ్య నేతలు ఇంటింటికీ కాంగ్రెస్ 6 గ్యారెంటీలు
Congress Six Guarantees Telangana : విజయభేరి సభలో కాంగ్రెస్ ప్రకటించిన '6 గ్యారెంటీలు' ఇవే!
CWC Meeting Hyderabad 2023 : హైదరాబాద్‌లో ముగిసిన సీడబ్ల్యూసీ సమావేశాలు