హైదరాబాద్ కుషాయిగూడలోని డీ మార్ట్‌ను పురపాలక అధికారులు సీజ్ చేశారు. డిసెంబర్ 30న పద్మారెడ్డి అనే వ్యక్తి .. డీమార్ట్‌లో ఖర్జూర పండ్లను కొనుగోలు చేశారు. వారం తర్వాత వాటిని తినేందుకు తీసి చూడగా... కుళ్లిపోయి వాసన వస్తున్నట్లు బాధితుడు తెలిపారు.
డీమార్ట్‌లో కుళ్లిన ఖర్జూరాలు.. సీజ్ చేసిన అధికారులు - కుషాయిగూడ డీ మార్ట్‌పై వినియోగదారుడు ఫిర్యాదు
హైదరాబాద్ కుషాయిగూడలోని డీ మార్ట్‌ను కాప్రా మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. కిమియా ఖర్జూరాలు కొనుగోలు చేసిన పద్మారెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో తనిఖీలు చేపట్టారు. బాక్సులను తెరిచి చూడగా కుళ్లినపోయిన స్థితిలో ఉన్నట్లు బాధితుడు వెల్లడించాడు.
కుషాయిగూడ డీమార్ట్ సీజ్ చేసిన అధికారులు
అతను వెంటనే పురపాలక అధికారులకు ఫిర్యాదు చేశాడు. డీమార్ట్‌ను తనిఖీ చేసిన కాప్రా పురపాలక ఏఎంహెచ్ఓ డాక్టర్ మైత్రేయి, పోలీసుల సహకారంతో డీమార్ట్‌ను సీజ్ చేశారు.
ఇదీ చూడండి:రూ.2508 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి అనుమతి
Last Updated : Jan 7, 2021, 6:30 PM IST