Customer care Fraud Hyderabad : సైబర్ నేరగాళ్లు దొరికిన ఏ అవకాశాన్ని వదలడం లేదు. ఎవరి నుంచి ఎప్పుడు ఎలా డబ్బులు దోచుకుందామా అని చూస్తుంటారు. మీరు ఏదైనా కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్ వెతికి కాల్ చేస్తున్నారా. అయితే మీ అంతట మీరే సైబర్ నేరగాళ్ల (Cyber Crime) వలకు చిక్కుకుంటున్నట్లే. ఎందుకంటే.. తాజాగా హైదరాబాద్‌లో ఇలా ఓ వ్యక్తి ఓ కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్‌లో వెతికి చివరికి సైబర్ కేటుగాళ్లకు చిక్కాడు. వారు ఆ వ్యక్తి నుంచి భారీగా డబ్బులు కాజేశారు. ఇంతకీ ఏమైందంటే..?
Fake Customer care number Fraud Hyderabad : హైదరాబాద్‌లోని నిజాంపేటకు చెందిన ఓ వృద్దుడి నుంచి రూ.3.47లక్షలు కాజేశారు సైబర్ కేటుగాళ్లు. ఫోన్ పే(Phone Pay)లో ఓ వ్యక్తికి రూ.50 వేలు పంపిన బాధితుడు.. అతడి ఖాతాలో డబ్బు క్రెడిట్ కాకుండానే తన ఖాతా నుంచి డబ్బులు డెబిట్ అవ్వడంతో కంగుతిన్నాడు. ఇక తన మొబైల్ నంబర్‌కు ధ్రువీకరణ సందేశం రాకపోవడంతో కంగారు పడ్డాడు. వెంటనే ఫోన్ పే కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్‌లో వెతికి అందులో కనిపించిన నంబర్‌కు కాల్ చేశాడు.
అయితే ఆ నంబర్ ఫేక్ కావడం.. సైబర్ కేటుగాళ్లలో వృద్ధుడు చిక్కడం క్షణాల్లో జరిగిపోయాయి. డబ్బు రిటర్న్ పంపాలంటే ఎనీ డెస్క్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ఆ వృద్ధుడిని నమ్మించిన కేటుగాళ్లు యాప్ డౌన్లోడ్ చేయగానే.. అతడి మొబైల్‌లోకి చొరబడి అతడి ఖాతాలో ఉన్న రూ.3.47 లక్షలు కాజేశారు. మోసపోయానని అర్థమైన వృద్ధుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
Online Fraud In Karimnagar : తక్కువ ధరకే ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారం అంటూ.. రూ.9 కోట్లు స్వాహా
ఫుడ్ కొందాం అనుకుంటే లక్షలు పోయాయి : మరో కేసులో మియాపూర్‌కి చెందిన మరో వృద్దుడిని మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. ఫేస్ బుక్‌లో కనిపించిన ఫుడ్‌ను ఆర్డర్ పెట్టేందుకు బాధితుడు ప్రయత్నించాడు. అతను క్యాష్ ఆన్ డెలివరి ఆప్షన్ ఎంచుకున్నా..నేరగాళ్లు మాత్రం మినిమమ్ రూ.10 ట్రాన్ఫర్ చేయాలని కోరారు. వారు చెప్పిన విధంగా క్రెడిట్ కార్డు నుంచి బాధితుడు రూ.10 పంపాడు. వెంటనే కార్డు నుంచి విడతల వారగా రూ.1.86 లక్షలు డెబిట్ అవ్వడంతో కంగుతిన్నాడు. బ్యాంకు అధికారులకు ఫోన్ చేసి కార్డు బ్లాక్ చేయించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Cyber Investment Fraud :పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని ఆశపడిన ఒక వ్యక్తి ఉన్న డబ్బులన్నీ పెట్టుబడి పెట్టి మోసపోయిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని బోలో నగర్‌కు చెందిన తరుణ్ శర్మకు ఇన్‌స్టాగ్రామ్‌లో బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెడితే రెండు గంటల్లో లాభాలు అంటూ ఒక ప్రకటన చూశాడు.
రెండు గంటల్లో అధిక లాభాలు : ఆ ప్రకటనను ఆసక్తిగా చూసిన వ్యక్తి అవతలి వ్యక్తి సూచన మేరకు మొదటగా రూ.10 వేలు పెట్టుబడి పెట్టాడు. అందుకు సంబంధించిన లాభాన్ని రెండు గంటల తర్వాత విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించి విఫలం అయ్యాడు. దీంతో ఆ వ్యక్తికి మరో రూ.20 వేలు పెట్టుబడి పెట్టాలని ఆన్‌లైన్లో సూచించారు సైబర్ కేటుగాళ్లు. మొత్తం రూ.30 వేలు ఆన్లైన్ ద్వారా పెట్టుబడి పెట్టినా అదే సమస్య తలెత్తింది. దీంతో సైబర్ మోసానికి గురైనట్లుఅనుమానం వచ్చిన సదరు వ్యక్తి.. బ్యాంకుకు ఫోన్ చేసి తన లావాదేవీలను ఆపాలని బ్యాంకు మేనేజర్‌ను కోరారు. పెట్టుబడి పేరుతో తాను మోసపోయినట్లు గురించి బంజారాహిల్స్ పోలీసులు ఆశ్రయించగా సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ITR Scam : ఐటీ రిఫండ్ స్కామ్‌లో ఇరుక్కుపోవద్దు.. కేంద్రం హెచ్చరిక!
Cyber criminals cheated young woman : జాబ్ ఆఫర్ అంటూ నిండా ముంచేశారు..