Customer Care Fraud Cheaters Arrest : హాలో మేము కస్టమర్ కేర్(Customer Care Fraud) నుంచి మాట్లాడుతున్నాము.. మీరు ఇన్సురెన్స్ తీసుకున్నారు కదా.. మీరు తీసుకున్న పాలసీకి ఇంకో పాలసీ కడితే ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి.. అదనంగా మీకు ప్రయోజనం కలుగుతుంది. ఈ పాలసీ(Policy)ని తీసుకోవాలనుకుంటే వెంటనే మీకు పంపిన లింక్‌పై క్లిక్ చేయండని.. తీసుకుంటే మీకే మంచిదని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తారు. ఈ మధ్య అలాంటి కస్టమర్ కాల్ సెంటర్ కేసులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఒకవేళ బెనిఫిట్స్ గురించి ఆలోచించి వారు చెప్పినట్లుగా పాన్‌నంబరు, బ్యాంకు వివరాలు చెప్పిన.. వారు పంపిన లింక్‌ను క్లిక్ చేసినా మీ అకౌంట్లో డబ్బులు గోవిందా.
తాజాగా ఇలానే సైబర్ మోసగాళ్ల(Cyber Crimes) వలలో పడి హైదరాబాద్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగిని ఏకంగా రూ.45 లక్షలను పోగొట్టుకుంది. చివరికి మోసపోయానని గమనించి.. సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో కాల్ సెంటర్‌పై దాడి చేసి నలుగురి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Cyber Crime Gangs Arrest : హలో.. అంటూ అందినకాడికి దోచేస్తున్న ముఠాలు అరెస్టు
Customer Care Fraud 4 Members Arrest :పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఫేక్ కస్టమర్ కేర్‌ను దిల్లీ కేంద్రంగా నడుపుతున్నారు. వీరి ప్రధాన లక్ష్యం ఇన్సురెన్స్ కట్టిన వారిని ఐడెంటిఫై చేసి.. కాల్ చేస్తారు. పాలసీ కట్టిన వారిని ఇంకో పాలసీ కట్టాలని.. ఉన్న పాలసీలో కంటే ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయని నమ్మిస్తారు. అలా మోసపోయిన ఓ విశ్రాంత ఉద్యోగిని నుంచి ఏకంగా రూ.45 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత ఆమె తను మోసపోయాననే విషయం గ్రహించి.. హైదరాబాద్‌లోని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.