Custom Milling Rice Issue In Telangana : ఆరుగాలం కష్టపడి రైతులు ధాన్యం పండించగా వాటిని మద్దతు ధరతో కొనేందుకు ప్రభుత్వం రూ.వేల కోట్లు ఖర్చు పెట్టింది. ఈ క్రమంలోనే పౌరసరఫరాల సంస్థ అప్పులు ఇప్పటికే రూ.56 వేల కోట్లు దాటాయి. ఈ రుణాలపై సంస్థ సంవత్సరానికి రూ.3 వేల కోట్ల వడ్డీలు కడుతోంది. కానీ ఇంత అప్పులు చేసి సేకరించిన లక్షల టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు ఒక్కరూపాయి పెట్టుబడి లేకుండానే అప్పగించేశారు. ఈ విషయంపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) కూడా తన తొలి సమావేశంలో తెలియజేశారు.
రూ.70 కోట్ల విలువైన సీఎంఆర్ పక్కదారి - మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబసభ్యుల ఇళ్లలో అధికారుల తనిఖీలు
Custom Milling Rice Illegal Business in Telangana :మిల్లర్ల నుంచి ఎలాంటి బ్యాంకు గ్యారంటీ లేకుండా రూ.వేల కోట్ల విలువైన ధాన్యాన్ని ఎలా అప్పగించారని అధికారులను ఆయన ప్రశ్నించారు. మిల్లర్లు క్వింటా ధాన్యానికి 67 కిలోల బియ్యం కస్టమ్ మిల్లింగ్ రైస్(Custom Milling Rice) చొప్పున భారత ఆహార సంస్థ ఎఫ్‌సీఐకి (FCI) తిరిగి ఇవ్వాలి. కానీ కొందరు నేరుగా వడ్లనే అమ్మేసుకుంటే మరి కొందరు బియ్యంగా మార్చి పక్కదారి పట్టించారు. మరికొందరు బాయిల్ చేసి విదేశాలకూ ఎగుమతి చేశారు. ఇలా ఒక్కో రైస్ మిల్లు నుంచి వేల బస్తాల ధాన్యం మాయమవుతున్నాయి. ఈ లోటును పూర్తి చేసేందుకు యూపీ, ఛత్తీస్‌గఢ్, వంటి రాష్ట్రాల నుంచి వచ్చే పీడీఎస్(PDS) బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇచ్చే సీఎంఆర్ లో కలిపేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
మిగిలిన కస్టం మిల్లింగ్ రైస్‌ను అప్పగించండి: పౌరసరఫరాల శాఖ
Custom milling Rice Scam : తీసుకున్న ధాన్యానికి సీఎంఆర్ ఇవ్వడానికి ఆరు నెలల గడువు ఉంటుంది. చాలామంది మిల్లర్లు వివిధ కారణాలు చూపిస్తూ రెండు సీజన్ల(ఏడాది) తర్వాతే ఇస్తున్నారు. మరికొందరు ఏడాదిన్నర, రెండేళ్ల వరకు ఇవ్వడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత వర్షాకాలానికి సంబంధించిన సీఎంఆర్ 60% కూడా ఇవ్వలేదు. కరీంనగర్ జిల్లాలో 2021-22 సీజన్‌కు సంబంధించి సీఎంఆర్ ఇప్పటికీ ఇవ్వలేదు. అధికారుల తనిఖీలు, ఒత్తిళ్లు పెరిగినప్పుడు కొందరు తర్వాత సీజన్‌లో వచ్చే ధాన్యంతో సర్దుబాటు చేస్తే మరికొందరు రైతుల నుంచి అప్పటికప్పుడు కొనుగోలు చేసి ధాన్యం ఉన్నట్లు చూపిస్తున్నారు.
Officials Negligence on Custom Milling Rice: సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోని కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల రైస్‌మిల్లర్లు ఆంధ్రప్రదేశ్ నుంచి ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేసి లెక్కలు సర్దుబాటు చేస్తున్నారు. ఇంకొందరు మిల్లర్లు ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఇచ్చే బియ్యాన్ని డీలర్లు, దళారుల ద్వారా సేకరించి రీసైక్లింగ్ చేసి కలిపేస్తున్నారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఏ మిల్లర్ వద్ద ఎంత ధాన్యం ఉందనేది తెలీదు. సీఎంఆర్ ఎంత ఇచ్చారు, ఇంకా ఎంత రావాల్సి ఉందన్న వివరాలు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. కానీ అధికారులు, మిల్లర్ల కుమ్మక్కుతో నామమాత్రంగా తనిఖీలు జరిగినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
custom milling rice problems : కస్టమ్ మిల్లింగ్‌కు కష్టాలు.. గుట్టలుగా పేరుకుపోతున్న ధాన్యం బస్తాలు
'కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీని అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలి'