హైదరాబాద్ నగరాన్ని క్యుములోనింబస్ మేఘాలు ఆవరించాయి. గత రెండు రోజుల నుంచి నగరంలో కురుస్తున్న వర్షాలకు ఈ మేఘాలే కారణమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జంటనగరాల్లో పలు ప్రాంతాల్లో సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. చిలకలగూడ, బోయిన్పల్లి, మారేడుపల్లి, అడ్డగుట్ట, ఫ్యాట్నీ, ప్యారడైస్, తిరుమలగిరి, నాంపల్లి, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.
భాగ్యనగరాన్ని కమ్మేసిన క్యుములోనింబస్ మేఘాలు..! - హైదరాబాద్‌లో వర్షం
మొన్నటివరకు ఎండలకు సతమతమైన హైదరాబాద్ నగర ప్రజలకు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఉపశమనం కలిగిస్తున్నాయి. నగరాన్ని క్యుములోనింబస్ మేఘాలు ఆవరించినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో నగరంలోని ఏదో ఒక ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది.
![భాగ్యనగరాన్ని కమ్మేసిన క్యుములోనింబస్ మేఘాలు..! Cumulonimbus clouds in Hyderabad city](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7477249-323-7477249-1591278265691.jpg)
భాగ్యనగరాన్ని కమ్మేసిన క్యుములోనింబస్ మేఘాలు..!
సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావటం వల్ల పూర్తిగా మేఘావృతమై చల్లబడింది. మొన్నటి వరకు వేసవి తాపాన్ని తట్టుకోలేక అల్లాడిపోయిన నగరవాసులు ప్రస్తుతం కురుస్తున్న వానలతో ఉపశమనం పొందుతున్నారు. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. దీనివల్ల వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.