నయనానందకరం.... నృత్య మనోహరంగా సాగింది చిన్నారి అదితి భరతనాట్య ప్రదర్శన. హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాయలంలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో భరత నాట్య రంగప్రవేశం చేశారు ప్రముఖ భరతనాట్య గురువు స్మితా మాధవ్ శిష్యురాలైన చిన్నారి అదితి. ఈ సందర్భంగా వివిధ అంశాల్లో రాగ, తాళ, భావయుక్తంగా నర్తించి... కళాభిమానులను అలరించారు. పుష్పాంజలిలో నాట్యారంభం చేసి... అలరిప్పు, వర్ణం, థిలాన వంటి అంశాల్లో ఎంతో పరిణతితో నాట్య ప్రదర్శన చేసి మెప్పించారు. అనంతరం గురువు స్మితా మాధవ్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పలువురు కళాభిమానులు పాల్గొని... చిన్నారి అదితిని అభినందించారు.
నేత్ర మనోహరం... ఈ చిన్నారి నృత్య రూపకం - Hyderabad NTR Auditorium
హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో చిన్నారి అదితి భరతనాట్య రంగ ప్రవేశం చేసి... వివిధ అంశాల్లో తన నాట్య ప్రదర్శనతో ఆహుతులను అలరించింది. కార్యక్రమానికి హాజరైన కళాభిమానులు చిన్నారి అదితిని ప్రశంసించారు.
Cultural Dance Performance By Aditi