తెలంగాణ

telangana

ETV Bharat / state

'మహిళ ఆరోగ్యంగా ఉంటేనే... ఇంటిల్లిపాది ఆరోగ్యం' - hyderabad pink ribbon walk

హైదరాబాద్​ కేబీఆర్​ పార్కు వద్ద పింక్​ రిబ్బన్​ వాక్​ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో సీఎస్​ ఎస్కే జోషి, జయేశ్​ రంజన్, హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.

'మహిళ ఆరోగ్యంగా ఉంటేనే... ఇంటిల్లిపాది ఆరోగ్యం'

By

Published : Oct 6, 2019, 11:27 AM IST

రొమ్ము క్యాన్సర్​ను తొలిదశలోనే గుర్తిస్తే జయించవచ్చునని డాక్టర్‌ రఘురాం తెలిపారు. మహిళలలో కొత్త మార్పులు కనిపిస్తే... నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని కోరారు. హైదరాబాద్ కేబీఆర్ పార్కు వద్ద పింక్‌ రిబ్బన్ వాక్ నిర్వహించారు. అక్టోబర్‌ నెలను అంతర్జాతీయ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం పేరుతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రొమ్ము క్యాన్సర్‌పట్ల అవగాహన పెంపొందించేందుకు ఉషాలక్ష్మి బ్రెస్ట్‌క్యాన్సర్ ఫౌండేషన్ తో కలిసి కిమ్స్‌ ప్రచార కార్యక్రమాలను చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పింక్​ వాక్​లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్ర్వీ ఫిల్లింగ్, ఎస్​బీఐ చీఫ్​ జనరల్ మేనేజర్ ప్రకాశ్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

మహిళలు ఆరోగ్యంగా, ధైర్యంగా ఉంటేనే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారని... 12ఏళ్లుగా మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు ఈ పింక్ థాన్ చేపడుతున్న డాక్టర్​ రఘురాంను జోషి, జయేశ్ రంజన్, అంజనీ కుమార్ అభినందించారు.

'మహిళ ఆరోగ్యంగా ఉంటేనే... ఇంటిల్లిపాది ఆరోగ్యం'
ఈ కథనం చదవండి: ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలి

ABOUT THE AUTHOR

...view details