తెలంగాణ

telangana

ETV Bharat / state

యాంటీ బాడీస్​ తయారీకి భారత్​ బయోటెక్​కు అనుమతి

కరోనా కట్టడి కోసం యాంటీ బాడీస్​ తయారీకి భారత్​ బయోటెక్​కు సీఎస్​ఐఆర్​ అనుమతులిచ్చింది. ఎన్​ఎంఐటీఎల్​ఐ ప్రోగ్రాంలో భాగంగా కొవిడ్​-19 నివారణకు ఉపయోగపడే మానవ మోనోక్లోనల్ యాంటీ బాడీస్ తయారీ ప్రాజెక్టును సీఎస్​ఐఆర్​... భారత్ బయోటెక్​కి అప్పగించింది. వీటి తయారీ వల్ల కొవిడ్​ వ్యాప్తిని అడ్డుకోవడం సులభం కానుంది.

Bharath Biotech CSIR Anitbodies
యాంటీ బాడీస్​ తయారీకి భారత్​ బయోటెక్​కు అనుమతి

By

Published : May 8, 2020, 2:40 PM IST

Updated : May 8, 2020, 3:36 PM IST

కొవిడ్-19 నియంత్రణ కోసం మానవ మోనో క్లోనల్​ యాంటీ బాడీస్​ తయారీకి భారత్​ బయోటెక్​కు కౌన్సిల్​ ఆఫ్​ సైంటిఫిక్​ అండ్​ ఇండస్ట్రీయల్​ రీసెర్చ్​ ( సీఎస్ఐఆర్ ) అనుమతులిచ్చింది. న్యూ మిలీనియం ఇండియన్​ టెక్నాలజీ లీడర్​షిప్​ ఇనిషియేటివ్​ ( ఎన్​ఎంఐటీఎల్​ఐ ) ప్రోగ్రాంలో భాగంగా ఈ ప్రాజెక్టును సీఎస్​ఐఆర్​... భారత్ బయోటెక్​కి అప్పగించింది. ఇందులో భాగంగా భారత్ బయోటెక్... నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండస్ట్రీ ప్రేడొమిక్స్​ టెక్నాలజీ సంస్థలతో కలిసి పనిచేయనుంది.

మానవ శరీరంలోని కరోనా వైరస్​ని ఈ మోనో క్లోనల్ యాంటీ బాడీస్ అత్యంత వేగంగా నియంత్రిస్తాయి. దీని వల్ల వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడం సులభంగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ వ్యాక్సిన్ కోసం ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నప్పటికీ... వ్యాక్సిన్ కంటే మోనోక్లోనల్ యాంటీ బాడీస్ కరోనాను అడ్డుకోవడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా అభిప్రాయపడ్డారు.

యాంటీ బాడీస్​ తయారీకి భారత్​ బయోటెక్​కు అనుమతి

ఇవీ చూడండి:క్షేత్రస్థాయిలో నిఘా: ఆ సడలింపులు ఇద్దామా? వద్దా?

Last Updated : May 8, 2020, 3:36 PM IST

ABOUT THE AUTHOR

...view details