ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. హైదరాబాద్, జీడిమెట్లలోని మేఘ ఇంజినీరింగ్ కంపెనీలో ఆకస్మికంగా పర్యటించారు. సంబంధిత అధికారులు, కంపెనీ పెద్దలతో కలిసి ఆక్సిజన్ ట్యాంకుల తయారీని పరిశీలించారు.
మేఘ ఇంజినీరింగ్ కంపెనీలో సీఎస్ ఆకస్మిక పర్యటన - Megha Engineering Company
హైదరాబాద్, జీడిమెట్లలోని మేఘ ఇంజినీరింగ్ కంపెనీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆకస్మికంగా పర్యటించారు. అధికారులతో కలిసి ఆక్సిజన్ ట్యాంకుల తయారీని పరిశీలించారు.
![మేఘ ఇంజినీరింగ్ కంపెనీలో సీఎస్ ఆకస్మిక పర్యటన cs somesh kumar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-04:33:02:1622545382-tg-hyd-47-01-csatjeedimetla-av-ts10011-01062021155139-0106f-1622542899-926.jpg)
cs somesh kumar
అనంతరం సీఎస్.. కంపెనీ పెద్దలతో కలిసి ఆక్సిజన్ ఉత్పత్తి గురించి చర్చించారు. రాష్ట్రంలోని పలు ఆసుపత్రులకు.. ఆక్సిజన్ ప్లాంట్లు అందించేందుకు వీలుగా వారికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో.. రాష్ట్ర ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రాస్, టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:sonu sood: మటన్షాప్ ఓనర్ సాయం.. సోనూసూద్ చమత్కారం..!
Last Updated : Jun 1, 2021, 6:13 PM IST