కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై కంటైన్మెంట్ క్లస్టర్లపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. గృహనిర్బంధం, నిఘా, జిల్లాల్లోని వలస కార్మికులకు ఉపశమనం తదితర అంశాలపై చర్చించారు. కంటైన్మెంట్ క్లస్టర్లలో ప్రతి ఇంటిని, రోజువారి స్థావరాలపై రెండు సార్లు తనిఖీ చేయాల్సి ఉంటుందని.. అనుమానితులు ఉంటే వెంటనే చికిత్స కోసం తరలించాలని సీఎస్ సూచించారు.
కరోనా కట్టడి చర్యలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియోకాన్ఫరెన్స్ - cs video conference with collectors on corona preventive actions
కరోనా విజృంభిస్తోన్న సమయంలో ప్రజలు సురక్షితంగా ఉండడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేర్కొన్నారు. కంటైన్మెంట్ (అదుపుచేసే) క్లస్టర్లపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో సమావేశం నిర్వహించారు.
![కరోనా కట్టడి చర్యలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియోకాన్ఫరెన్స్ cs someshkumar review with collectors on corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6731294-thumbnail-3x2-cs-rk.jpg)
కంటైన్మెంట్ ప్రదేశాల్లో రోజూ రెండు సార్లు క్రిమిసంహారక మందులు పిచికారి చేయాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ప్రభుత్వ క్వారంటైన్లోనే ఉండేందుకు అనుమతించాలన్నారు. దిగ్బంధం, గృహ నిర్బంధ వ్యక్తుల వల్ల ఏమైనా ఉల్లంఘనలు జరిగితే కఠినంగా వ్యవహరించాలని సూచించారు. నిత్యావసర వస్తువులను కంటైన్మెంట్ క్లస్టర్లలో ఇళ్ల వద్దకే పంపిణీ చేసేలా చూడాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇంటి దిగ్బంధం ఉన్న వారికి స్థానిక జట్ల నిఘా చాలా ముఖ్యమని.... ఈ సమయంలో అనుసరించాల్సిన సూచనలతో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. స్థానిక భాషల్లో కరపత్రాలను ప్రచురించాలని కలెక్టర్లకు వివరించారు.
ఇదీ చదవండి:కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక
TAGGED:
hyderabad latest nes