తెలంగాణ

telangana

ETV Bharat / state

CS: వ్యవసాయ అనుబంధ రంగాలకు సర్కార్ పెద్దపీట - Jeedimetla Center of Excellence

హైదరాబాద్‌లోని జీడిమెట్ల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను సీఎస్ సోమేశ్​కుమార్ సందర్శించారు. ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ, ఉద్యాన రంగానికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. రైతుల సౌకర్యార్థం కూరగాయలు, పూల మొక్కలు శాస్త్రీయ విధానంలో పెంచి సరఫరా చేస్తుండటం పట్ల ఉద్యాన శాఖను సీఎస్​ అభినందించారు.

CS Somesh
సర్కార్ పెద్దపీట

By

Published : Aug 12, 2021, 7:01 PM IST

రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ, ఉద్యాన రంగానికి పెద్దపీట వేసి ప్రభుత్వం... రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్ (Cs Somesh Kumar) అన్నారు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను (Center of excellence) సీఎస్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ సంచాలకులు లోక వెంకటరామిరెడ్డి, ఇతర అధికారులు, పలువురు రైతులు పాల్గొన్నారు.

దేశంలో పేరెన్నికగన్న సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రాంగణంలో సీఎస్ మొక్క నాటారు. చుట్టూ అంతా కలియతిరిగి కార్యకలాపాలు పరిశీలించారు. రైతుల సౌకర్యార్థం కూరగాయలు, పూల మొక్కలు శాస్త్రీయ విధానంలో పెంచి సరఫరా చేస్తుండటం పట్ల ఉద్యాన శాఖను అభినందించారు. రైతులకు అందిస్తున్న సేవలను కొనియాడారు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత సాగునీటి వనరులు పుష్కలంగా అందుబాటులోకి రావడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో సంప్రదాయ వరికి ప్రత్యామ్నాయంగా పర్యావరణహిత పండ్లు, కూరగాయలు, ఆకుకూరల సాగు వైపు రైతులను మళ్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్ సూచించారు.

ఇదీ చదవండి:ERRABELLI: సొంత స్థలాలు ఉంటే.. ఈ ఏడాది నుంచే ఇళ్లు కట్టిస్తాం

ABOUT THE AUTHOR

...view details