సకాలంలో వ్యాక్సిన్ చేయించుకోలేని వారికి మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా టీకా వేస్తున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లో 30 మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాలను ఎంచుకుని ప్రత్యేకంగా వ్యాక్సిన్లు అందిస్తున్నట్లు తెలిపారు. మోండా మార్కెట్లో కూరగాయలు విక్రయించేవారిలో ఇప్పటి వరకు టీకా వేసుకోని వారికి అవగాహన కల్పించి వ్యాక్సిన్ ఇప్పిస్తున్నట్లు వెల్లడించారు.
అందరికీ అందుబాటులో మొబైల్ వ్యాక్సిన్ కేంద్రం - సీఎస్ సోమేశ్‌కుమార్ తాజా వార్తలు
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 96 లక్షల డోసుల వ్యాక్సిన్లు ఇచ్చామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. ఒకట్రెండు రోజుల్లో కోటి డోసులు పూర్తవుతుందని స్పష్టం చేశారు. మోండా మార్కెట్లో ఏర్పాటుచేసిన మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
cs somesh kumar visit mobile covid vaccination center
గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు 100 కేంద్రాల్లో వ్యాక్సిన్ అందిస్తున్నామని సీఎస్ తెలిపారు. వీలైనంత త్వరగా అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషిచేస్తోందని వివరించారు. వ్యాక్సిన్ పంపిణీ గురించి ఎప్పటికప్పడు సీఎం కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని సీఎస్ వెల్లడించారు.