తెలంగాణ

telangana

ETV Bharat / state

వేతన సవరణ, వయో పరిమితి పెంపుపై రేపు చర్చ! - telangana news today

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ, వయో పరిమితి పెంపు వంటి అంశాలపై రేపట్నుంచి ఉద్యోగ సంఘాలతో సీఎస్​ నేతృత్వంలోని కమిటీ చర్చించే అవకాశం ఉంది. సోమవారం పలు అంశాలపై చర్చించిన సోమేశ్​కుమార్​ కమిటీ పలు అంశాలపై చర్చ జరిపింది.

cs somesh kumar talks on pay revision, age limit hike issues
వేతన సవరణ, వయో పరిమితి పెంపుపై రేపు చర్చ!

By

Published : Jan 26, 2021, 2:38 AM IST

Updated : Jan 26, 2021, 2:53 AM IST

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ, వయో పరిమితి పెంపు వంటి అంశాలపై... ఉద్యోగ సంఘాలతో రేపట్నుంచి చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎస్ సోమేశ్ కుమార్ నేతృత్వంలోని అధికారుల కమిటీ.. సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు సోమవారం సమావేశమై.. పలు అంశాలపై చర్చించింది.

ఉద్యోగ సంఘాలతో చర్చల షెడ్యూలు సైతం రూపొందించింది. దాని ప్రకారం... ఈ నెల 27 నుంచి చర్చలు జరిగే అవకాశం ఉంది. గుర్తింపు పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను చర్చలకు పిలవనున్నట్లు సమాచారం.

రెండు రోజుల పాటు చర్చలు జరిగే అవకాశం ఉంది. చర్చల ఆధారంగా వేతన సవరణ, పదవీ విరమణ వయస్సు పెంపు అంశాలపై... అధికారుల కమిటీ ముఖ్యమంత్రికి నివేదిక అందించనుంది.

ఇదీ చూడండి :గాన గంధర్వుడికి పురస్కారాలు దాసోహం

Last Updated : Jan 26, 2021, 2:53 AM IST

ABOUT THE AUTHOR

...view details