కరోనా టీకా విషయంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. కోటి డోసుల మైలురాయిని చేరుకున్న సందర్భంగా కోఠీలోని డీహెచ్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారం టీకా వేసే కార్యక్రమం సాగుతోందని... సూపర్ స్ప్రెడర్లు, హై రిస్క్ ఉన్న వారికి టీకా అందించటం అందులో భాగమని అన్నారు.
CS SOMESHKUMAR: దేశానికే ఆదర్శంగా నిలిచాం..: సీఎస్ సోమేష్ కుమార్ - కరోనా టీకాల తాజా వార్తలు
రాష్ట్రంలో కరోనా కోటి టీకాల మైలురాయిని చేరుకోవడం చాలా సంతోషంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ టీకాలు తీసుకోవాలని సూచించారు.
టీకాల విషయంలో బడ్జెట్ సమస్య లేదని... ఎక్కువ డోసులు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని సీఎస్ పేర్కొన్నారు. పాఠశాలలు ప్రారంభం అవుతున్న దృష్ట్యా... ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి టీకా కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. అందరూ కొవిడ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. రాష్ట్రంలో ఇంకా రెండు కోట్ల మందికి పైగా టీకా తీసుకోవాల్సిన వారున్నారని డీహెచ్ శ్రీనివాస రావు తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఉన్న ఆశా, ఏఎన్ఎమ్ వర్కర్ల వల్లే టీకా వేగంగా ఇవ్వగలుగుతున్నామని అన్నారు.
ఇదీ చూడండి: KTR: కేటీఆర్ చొరవ.. చిన్నారికి పునర్జన్మ
TAGGED:
కరోనా టీకాల తాజా వార్తలు