సచివాలయం మొదలు జిల్లా స్థాయి వరకు అన్ని విభాగాల్లో పదోన్నతుల ప్రక్రియను.. వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వివిధ శాఖల కార్యదర్శులతో సచివాలయంలో సమావేశమైన సీఎస్... ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను సమీక్షించారు.
పదోన్నతుల ప్రక్రియలో వేగం పెంచండి: సీఎస్ - cs somesh kumar meeting for promotions
రాష్ట్రంలో అన్ని విభాగాల్లో పదోన్నతుల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు వివిధ శాఖల కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేయాలి: సీఎస్
శాఖల వారీగా పదోన్నతుల ప్రక్రియను సమీక్షించిన ఆయన... వేగవంతం చేయాలని చెప్పారు. పదోన్నతుల ప్రక్రియకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న సోమేశ్ కుమార్... సాంకేతిక సమస్యలను పరిష్కరించి మార్గదర్శకాల ప్రకారం డీపీసీలు నిర్వహించాలని ఆదేశించారు.
ఇదీ చూడండి :జల్లికట్టు వేడుకలో అపశ్రుతి- ఇద్దరు మృతి